Home Guard Ravinder Died : ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హోంగార్డు రవీందర్ మృతి
జీతాలు ఇవ్వడం లేదని మూడు రోజుల క్రితం హెంగార్డ్ రవీందర్ ఆత్మహత్యాయత్నం చేశారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం పోలీసులు అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు.

Home Guard Ravinder Died
Home Guard Ravinder Died : హైదరాబాద్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హోంగార్డు రవీందర్ మృతి చెందారు. కంచన్ బాగ్ అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ (శుక్రవారం) మృతి చెందారు. రవీందర్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జీతాలు ఇవ్వడం లేదని మూడు రోజుల క్రితం హెంగార్డ్ రవీందర్ ఆత్మహత్యాయత్నం చేశారు.
చికిత్స నిమత్తం మొదట ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం పోలీసులు అపోలో డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ (శుక్రవారం) రవీందర్ మృతి చెందారు. మరోవైపు రవీందర్ మృతితో హోంగార్డులు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చారు.
ఇటీవలే గోషామహల్ స్టేడియం కమాండ్ రూమ్ కు వెళ్లినటువంటి హోంగార్డు రవీందర్ పై అక్కడున్న వంటి అధికారులు దుర్భాషలాడారు. జీతాలు సకాలంలో చెల్లించకపోవడంతో మనస్థాపానికి గురైన రవీందర్ అక్కడే ఉన్నటువంటి పెట్రోల్ బాటిల్ తో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అతన్ని చికిత్స కోసం మొదట ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మెరుగైన వైద్యం కోసం పోలీసులు రవీందర్ ను అపోలో డీర్డీవో ఆస్పత్రికి తరలించారు. నిన్న (గురువారం) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కోదంరాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోపాటు పలువురు ప్రముఖులు వచ్చి రవీందర్ రెడ్డిని పరామర్శించి, అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. డీఆర్డీవో ఆస్పత్రి వద్ద హోంగార్డులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తన భర్త మృతికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని హోంగార్డు రవీందర్ భార్య సంధ్య ఆరోపిస్తున్నారు.
Hyderabad: 3 నెలల క్రితమే ప్రేమ పెళ్లి.. 8 పేజీల లేఖ రాసి, రైలు కిందపడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డులు తమను పర్మినెంట్ చేయాలని, సకాలంలో జీతాలు చెల్లించాలని, వైద్య బీమా చెల్లించాలని గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. తమ గోడును పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని తమతో వెట్టి చాకిరి చేయించుకుని పోలీసు అధికారులు తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారని హోంగార్డులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు.
కాగా, హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఎఫెక్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులకు జీతాలు వేసింది. ప్రతిసారి 10వ తేదీన పడే జీతాలను ప్రభుత్వం ఈ సారి ముందుగానే వేసింది. హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్యాయత్నంతో హోంగార్డులకు ప్రభుత్వం జీతాలు వేసింది.