Minister Harish Rao : చనిపోయిన తర్వాత అవయవదానం ద్వారా మరొకరికి జీవితం ఇవ్వొచ్చు : మంత్రి హరీష్ రావు
యువతలో కూడా లివర్, కిడ్నీ సమస్యలు కనపడుతున్నాయని పేర్కొన్నారు. మన జీవన విధానంలో మార్పులే ఇందుకు కారణం అన్నారు.

Harish Rao
Minister Harish Rao : చనిపోయిన తర్వాత అవయవదానం ద్వారా మరొకరికి జీవితం ఇవ్వొచ్చని మంత్రి హరీష్ రావు అన్నారు. అవయవ దాతల కుటుంబసభ్యులకు ఏప్రిల్ (శనివారం ఏప్రిల్ 23, 2022) హైదరాబాద్ లోని రవీంద్రభారతీలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ 2020 సంవత్సరంలో 85 మంది అవయవ దానం చేశారని మంత్రి హరీష్ రావు తెలిపారు.
దీనివల్ల ఎంతో మందికి ప్రాణాలు నిలిచాయని చెప్పారు. బాధల్లో ఉండి కూడా అవయవ దానం చేయడం స్ఫూర్తిదాయకం అన్నారు. యువతలో కూడా లివర్, కిడ్నీ సమస్యలు కనపడుతున్నాయని పేర్కొన్నారు. మన జీవన విధానంలో మార్పులే ఇందుకు కారణం అన్నారు.
Green Channel : అవయవదానం : మదురై నుంచి చెన్నైకి 76 నిమిషాల్లో ఊపిరి తిత్తులు
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆరోగ్యశ్రీ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో 400 వరకు ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేశామని వెల్లడించారు.