Rajiv Yuva Vikasam : ‘రాజీవ్ యువవికాసం’పై కొత్త నిబంధనలు.. రూ.50 వేల లోపు రుణాలకు 100 శాతం సబ్సిడీ.. EBC నిరుద్యోగులు అప్లయ్ చేయడం ఎలా?

Rajiv Yuva Vikasam Scheme : చిరు వ్యాపారాల కోసం ప్రత్యేకించి రూ.50వేల రుణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పథకం కింద లబ్ధిదారులకు 100 శాతం సబ్సిడీతో రుణాలను అందించనుంది.

Rajiv Yuva Vikasam : ‘రాజీవ్ యువవికాసం’పై కొత్త నిబంధనలు.. రూ.50 వేల లోపు రుణాలకు 100 శాతం సబ్సిడీ.. EBC నిరుద్యోగులు అప్లయ్ చేయడం ఎలా?

Rajiv Yuva Vikasam

Updated On : March 23, 2025 / 1:20 PM IST

Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకం కింద స్వయం ఉపాధి రుణాలను మంజూరు చేసే నిబంధనలకు సంబంధించి నిర్ణయం తీసుకుంది.

ఈబీసీ నిరుద్యోగుల కోసం యూనిట్లను 4 కేటగిరీలుగా విభజించింది. అంతేకాదు.. ఈ పథకం కింద అందించే రుణాలపై కూడా సబ్సిడీ ఫండ్స్ వాటాను భారీగా పెంచేసింది. గతంలో స్వయం ఉపాధి పథకాలకు మించి కొత్త నిబంధనలను ప్రభుత్వం రూపొందిస్తోంది.

Read Also : Jio IPL Plan : వావ్ వండర్‌ఫుల్.. ఈ జియో ప్లాన్‌తో IPL మ్యాచ్‌లు 3 నెలలు ఫ్రీగా చూడొచ్చు.. మరెన్నో OTT బెనిఫిట్స్ కూడా!

ఇప్పటికే, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క దీనిపై సంక్షేమశాఖ సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా యూనిట్ల ఖర్చుతో పాటు సబ్సిడీ వాటాను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.

24న కొత్త నిబంధనలు అమలు :
అంతేకాదు. అదేవిధంగా, రాజీవ్‌ యువవికాసం పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు(EBC)కు త్వరలో యూనిట్లు మంజూరు చేయనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈబీసీ నిరుద్యోగుల కోసం ఆదివారం (మార్చి 23) నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిసింది. ఈ పథకానికి సంబంధించి కొత్త నిబంధనలు మార్చి 24న జారీ అయ్యే అవకాశం ఉంది.

చిరు వ్యాపారాల కోసం ప్రత్యేకించి రూ.50వేల రుణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పథకం కింద లబ్ధిదారులకు 100 శాతం సబ్సిడీతో రుణాలను అందించనుంది. అంతేకాదు.. రూ.లక్షలోపు యూనిట్లకు 90 శాతం సబ్సిడీని అందించనుంది.

గతంలో ఈ సబ్సిడీ 80శాతంగా ఉండేది. రూ.లక్షలోపు యూనిట్‌‌కు లబ్ధిదారులు కేవలం రూ.10వేలు మాత్రమే చెల్లించాలి. రూ.1 లక్షనుంచి రూ. 2 లక్షల్లోపు ఖరీదైన యూనిట్లకు సబ్సిడీని 80 శాతానికి ప్రభుత్వం పెంచింది. రూ.2 లక్షల నుంచి రూ. 4 లక్షల యూనిట్లకు సబ్సిడీని 70శాతంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలోని 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అర్హులైన యువతకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం అందనుంది. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి మార్చి 17న ప్రారంభించారు. అయితే, అర్హులైన యువకులు ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Read Also : Rajiv Yuva Vikasam Scheme : యువత భవిష్యత్తు కోసమే ‘రాజీవ్ యువ వికాస’ పథకం.. మీరూ అప్లయ్ చేశారా? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..!

  • ముందుగా అధికారిక పోర్టల్ (https://tgobmms.cgg.gov.in) విజిట్ చేయాలి.
  • రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్ లింక్ క్లిక్ చేయాలి.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించి ఆప్షన్లు కనిపిస్తాయి. ఏదైనా ఆప్షన్ ఎంచుకోవాలి.
  • కొత్త పేజీలో మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయాలి.
  • యూనిట్ల వివరాలకు సంబంధించి లింక్ ఉంటుంది.
  • ఆ లింక్ క్లిక్ చేస్తే చాలు.. యూనిట్లు వివరాలను పొందవచ్చు.