Fire Broke Out : హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. గంగారం జేపీ సినిమాస్ లో చేలరేగిన మంటలు

థియేటర్ లోని ఐదు స్క్రీన్ లకు మంటలు అంటుకున్నాయి. ముడు ఫైర్ ఇంజన్లలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

Fire Broke Out : హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. గంగారం జేపీ సినిమాస్ లో చేలరేగిన మంటలు

Chandanagar Fire Broke Out

Updated On : August 12, 2023 / 9:12 AM IST

Chandanagar Fire Broke Out : హైదరాబాద్ లో వరుసగా అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చందానగర్ లోని గంగారం జేపీ సినిమాస్ లో మంటలు చేలరేగాయి.

థియేటర్ లోని ఐదు స్క్రీన్ లకు మంటలు అంటుకున్నాయి.  దీంతో స్క్రీన్లు, ఫర్నిచర్ మంటల్లో ఖాళీ పోతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుంది.

Delhi fire : ఢిల్లీ మాయాపురి ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం..9మందికి గాయాలు

అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లలతో మంటలను అదుపు చేస్తోంది.  అయితే ఇప్పటికే లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.