Hyderabad : నగరంలో నవవధువు దారుణ హత్య
ఎన్నో ఆశలతో నూతన జీవితాన్ని ప్రారంభించిన నవవధువు పెళ్లయిన నెలకే దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన హైదరాబాద్ లో బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది.

Hyderabad
Hyderabad : ఎన్నో ఆశలతో నూతన జీవితాన్ని ప్రారంభించిన నవవధువు పెళ్లయిన నెలకే దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన హైదరాబాద్ లో బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది. ప్రగతినగర్‌కు చెందిన కిరణ్‌కు, సుధారాణి (22) అనే యువతితో ఆగస్టు 27న వివాహం జరిగింది. పెళ్లైన నాటినుంచి అనుమానంతో భార్యను వేధించేవాడు కిరణ్.. శనివారం అర్ధరాత్రి సమయంలో ఆమెను గొంతుకోసి అతి కిరాతకంగా హత్యచేశాడు. అనంతరం తానూ చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.
Read More : Gulab Hurricane : గులాబ్ తుపాను ప్రభావంతో పలు రైళ్లు రద్దు
సుధారాణి తల్లిదండ్రులు వచ్చి తలుపు తట్టగా ఎంతకీ తీయకపోవడంతో కిటికీలోంచి చూశారు. సుధారాణి రక్తపు మడుగులో పడిఉండడం చూసి కుప్పకూలిపోయారు. స్థానికుల అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకొని సుధారాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన కిరణ్‌ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెళ్లై నేలకూడా కాకుండానే కూతురు హత్యకు గురికావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు.