Huzurabad : ఉప ఎన్నిక, అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ మీటింగ్
Huzurabad by-election, Congress meeting on candidate selection

Cong
Huzurabad By-Election: హుజూరాబాద్ ఉప ఎన్నిక త్వరలో రాబోతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకపోతోంది. బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తూ..ప్రజల మధ్య తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి విషయంలో ఏ నిర్ణయం తీసుకోక తర్జనభర్జనలు పడుతోంది. అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకొనేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. అందులో భాగంగా..2021, ఆగస్టు 30వ తేదీ సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ ముఖ్యనేతలందరూ సమావేశమై…హుజూరాబాద్ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.
Read More : Bhavina Patel : పారాలింపిక్స్ భవీనా పటేల్‌కు రూ.3 కోట్లు ప్రైజ్ మనీ..
అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ మొదటి నుంచి మూడు రకాల సమీకరణాలను పరిశీలిస్తోంది. బీసీ, ఎస్సీ, ఓసీ కేటగిరిలను పరిగణలోకి తీసుకుంది. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ తరపున ఈటెల రాజేందర్ రంగంలోకి దిగడంతో.. కాంగ్రెస్ కూడా బీసీ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తోంది. అందులో భాగంగా కొండా సురేఖ, అదే విధంగా నియోజకవర్గంలో ఎస్సీ ఓటర్లు అధికంగా ఉండటంతో కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ సదానందం, అదే విధంగా ఓసీ కేటగిరిలో కిసాన్‌సెల్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి పేర్లను పరిగణలోకి తీసుకుంది.
Read More : RRR : నగర విధుల్లో సందడి చేసిన “ఆర్ఆర్ఆర్” బ్యూటీ
అయితే అభ్యర్థి విషయంలో పార్టీలో ఏకాభిప్రాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ఆదివారం కరీంనగర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించినప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన ముఖ్యనేతలు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులు హాజరుకాలేదు. దీంతో సోమవారం గాంధీభవన్‌లో ముఖ్యనేతలంతా మరోసారి భేటీ కాబోతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ చైర్మన్లు, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ, తదితర నేతలందరూ సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశంలోనే హుజురాబాద్ అభ్యర్థిని దాదాపు ఖరారు చేసే అవకాశముంది.