షాకింగ్.. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు ఎంతగా పెరిగాయంటే? ఏయే వాహనానికి ఎంతెంత.. వివరాలు?
ఓఆర్‌ఆర్‌పై రోజుకు యావరేజ్‌గా 1.5 లక్షల వాహనాలు ప్రయాణిస్తుంటాయి

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి మీరు తరుచూ ప్రయాణాలు చేస్తుంటారా? మీకో షాకింగ్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా సంస్థ ఓఆర్‌ఆర్‌పై టోల్ వసూలు చేస్తుందన్న విషయం తెలిసిందే.
ఏయే వాహనానికి ఎంత?
- కారు, జీపు, లైట్ వాహనాలకు కిలోమీటర్‌కు రూ.10 పైసలు పెంపు
- కిలోమీటరుకు ఇప్పటివరకు ఉన్న ఛార్జి రూ.2.34. ఇకపై ఉండే ఛార్జి రూ.2.44
- మినీ బస్, ఎల్‌సీవీలకు కిలోమీటర్‌కు ఉన్న ఛార్జి రూ.3.77. ఇకపై ఉండే ఛార్జి రూ.3.94
- 2 యాక్సిల్ బస్సులకు కిలోమీటరుకు ఇప్పటివరకు ఉన్న ఛార్జి రూ.6.69. ఇకపై ఉండే ఛార్జి రూ.7
- భారీ వాహనాలకు కిలోమీటరుకు ఇప్పటివరకు ఉన్న ఛార్జి రూ.15.09. ఇకపై ఉండే ఛార్జి రూ.15.78
Also Read: ఒప్పో నుంచి కళ్లు చెదిరే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లు.. ఫుల్ డీటెయిల్స్
ఓఆర్‌ఆర్‌పై టోల్ వసూలు చేస్తున్న ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా సంస్థ 30 ఏళ్ల కాలానికి ఈ విధులకు లీజుకు తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం పొడవు 158 కి.మీ. దీన్ని హెచ్‌ఎండీఏ రూ.6,696 కోట్లతో నిర్మించింది.
ఓఆర్‌ఆర్‌పై రోజుకు యావరేజ్‌గా 1.5 లక్షల వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ప్రతిరోజు యావరేట్ రూ.2 కోట్ల టోల్ వసూలవుతోంది. ప్రతి ఏడాది ఆర్థిక సంవత్సరం తొలి రోజు (ఏప్రిల్ 1) నుంచి టోల్ ఛార్జీలు పెరుగుతాయి. వాహనాల పరిమాణం, అవి వెళ్లే దూరాన్ని బట్టి టోల్ ఛార్జిని గణిస్తారు. భారీ వెహికిల్స్ అధిక టోల్ ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది.
మరోవైపు, హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై టోల్ రుసుములు తగ్గిస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నేషనల్ హైవేపై టోల్ రుసుము తగ్గగా హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై పెరగడం గమనార్హం.