Hyderabad Police Restrictions : న్యూఇయర్ వేడుకల్లో అలా చేస్తే కేసు నమోదు..! మందుబాబులకు పోలీసుల వార్నింగ్..

గత ఏడాదిలో చోటు చేసుకున్న పరిణామాలు, కస్టమర్ల పట్ల వ్యవహరించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి..

Hyderabad Police Restrictions : న్యూఇయర్ వేడుకల్లో అలా చేస్తే కేసు నమోదు..! మందుబాబులకు పోలీసుల వార్నింగ్..

Hyderabad Police Restrictions On New Year Celebrations

Updated On : December 31, 2024 / 6:46 PM IST

Hyderabad Police Restrictions : న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మద్యం సేవించి రోడ్లపై తిరిగితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్ చేయొద్దంటూ మందుబాబులకు వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. మరోవైపు డ్రగ్స్ వినియోగించకుండా ఫోకస్ పెట్టిన పోలీసులు.. పలు పబ్ లు, బార్లలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్, ఎక్సైజ్, మాదాపూర్ పోలీసులు పలు బార్లలో తనిఖీలు నిర్వహించారు.

మూడు కమిషనరేట్ల పరిధిలో కఠినమైన నిబంధనలు..
మరోవైపు న్యూఇయర్ వేడుకలకు సంబంధించి మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు కఠినమైన నిబంధనలు అమలు చేశారు. పబ్ లు, బార్లలో ఈవెంట్లకు సంబంధించి అనుమతి ఉన్న వారిని మాత్రమే న్యూఇయర్ వేడుకలు నిర్వహించాలని పోలీసులు తేల్చి చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారుగా 34 పబ్ లు ఉన్నాయి. అందులో 4పబ్ లకు ఈసారి నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు అనుమతి నిరాకరించారు పోలీసులు.

Also Read : రేవంత్ రెడ్డికి, అల్లు అర్జున్‌కు ఎక్కడో చెడింది: బండి సంజయ్‌

ఆ 4 పబ్ లకు నో పర్మిషన్..
గత ఏడాదిలో చోటు చేసుకున్న పరిణామాలు, కస్టమర్ల పట్ల వ్యవహరించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి నాలుగు పబ్ లకు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇక, 31వ తేదీ సందర్భంగా వైన్ షాపులను రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చు. ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాత్రి 12 గంటల తర్వాత కూడా బార్ లు నడుపుకునే అవకాశం ఇస్తోంది ప్రభుత్వం.

Hyderabad Pubs

న్యూసెన్స్ క్రియేట్ చేస్తే నిర్వాహకులదే బాధ్యత..
అయితే, 1 గంటకు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. న్యూసెన్స్ లేకుండా పరిమితికి లోబడి కస్టమర్లను పిలిపించుకోవాలని పోలీసు శాఖ సూచించింది. న్యూసెన్స్ క్రియేట్ చేస్తే నిర్వాహకులదే ఆ బాధ్యత అని పోలీసులు తేల్చి చెప్పారు. హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈవెంట్స్ జరగబోతున్నాయని పోలీసులు తెలిపారు.

 

Also Read : రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్.. అల్లు అర్జున్ వ్యవహారంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు