హైదరాబాద్‌లో మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు.. కూడళ్లలో 44 చోట్ల డైవెర్షన్ పాయింట్స్.. ఇలా వెళ్లండి..

12 కిలోమీటర్లు మేర హనుమాన్ శోభయాత్ర ఉంటుంది.

హైదరాబాద్‌లో మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు.. కూడళ్లలో 44 చోట్ల డైవెర్షన్ పాయింట్స్.. ఇలా వెళ్లండి..

Traffic restrictions

హైదరాబాద్ నగరంలో మంగళవారం నిర్వహించే హనుమాన్ శోభాయాత్ర సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ డైవర్షన్ ఎక్కడెక్కడ ఉంటుందో తెలుపుతూ హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి రూట్ మ్యాప్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

వాహనదారులు ఇబ్బందులు తలెత్తకుండా సూచించిన రూట్లలో వెళ్లాలని తెలిపారు. హనుమాన్ విజయయాత్ర వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమై.. సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ మందిర్‌కి వెళ్తుంది.

రేపు ఉదయం 11.30 రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ డైవెర్షన్స్ ఫాలో కావాలి. కూడళ్లలో 44 చోట్ల డైవెర్షన్ పాయింట్స్ ఉంటాయి. హైదరాబాద్ నగర పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు మూసేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి.

ట్రాఫిక్ డైవర్షన్స్ ఎక్కడెక్కడ?

  • గౌలిగూడ రామ మందిరం నుంచి మొదలై పుత్లీబౌలీ క్రాస్ రోడ్స్, ఆంధ్రాబ్యాంక్ క్రాస్ రోడ్స్, కోఠి, డీఎం అండ్ హెచ్ఎస్, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామకోటి క్రాస్ రోడ్స్, కాచీగూడ క్రాస్ రోడ్స్
  • నారాయణగూడ వైఎంసీఏ, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీనగర్, వైశ్రాయ్ హోటల్ వెనకవైపు, ప్రాగా టూల్స్, కవాడీగూడ, సీజీవో టవర్స్..
  • బన్సీలాల్ పేట్ రోడ్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయినీ మహంకాళి టెంపుల్, ఓల్డ్ రాంగోపాలపేట్ పీఎస్, ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, సీటీవో జంక్షన్
  • లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపెరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్, తాడ్ బండ్ హనుమాన్ ఆలయం దగ్గర లెఫ్ట్ టర్న్ దిశగా హనుమాన్ శోభాయాత్ర
  • 12 కిలోమీటర్లు మేర హనుమాన్ శోభయాత్ర
  •  రాత్రి 8 గంటలకు ముగియనున్న హనుమాన్ శోభాయాత్ర

Also Read : ఘోరాతి ఘోరం.. వాటర్ సంపులో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. వీడియో వైరల్