వీళ్లు ఏపీకి, వాళ్లు తెలంగాణకు.. హైకోర్టు ఆదేశాలతో రిలీవ్ అవుతున్న ఐఏఎస్‌లు..

ఎట్టి పరిస్థితుల్లో డీవోపీటీ ఆదేశాలను అనుసరించి ఏపీకి వెళ్లాల్సిందేనని హైకోర్టు, క్యాట్ తేల్చి చెప్పడంతో..

వీళ్లు ఏపీకి, వాళ్లు తెలంగాణకు.. హైకోర్టు ఆదేశాలతో రిలీవ్ అవుతున్న ఐఏఎస్‌లు..

Ias Officers Relieve

Updated On : October 16, 2024 / 9:18 PM IST

IAS Officers Relieve : ఏపీ ఐఏఎస్ అధికారులు తెలంగాణ సీఎస్ కు రిపోర్ట్ చేశారు. క్యాట్, తెలంగాణ హైకోర్టు ఏర్పాటుతో సీఎస్ శాంతికి రిపోర్ట్ చేశారు ఐఏఎస్ లు గుమ్మడి సృజన, శివశంకర్. సీఎస్ ను కలిసి జాయినింగ్ రిపోర్టు అందించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో అధికారులు రిలీవ్ అవుతున్నారు.

ఇక ఏపీలో రిపోర్టు చేయనున్న తెలంగాణ ఐఏఎస్ లు ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్, వాణీ ప్రసాద్, వాకాటి కరుణ. ఇప్పటికే తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యారు. రొనాల్డ్ రాస్ ట్రాన్స్ కో జెన్ కో ఎండీగా ఉన్నారు. ఆమ్రపాలి జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాకాటి కరుణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యూత్ అండ్ టూరిజమ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణీ ప్రసాద్ ఉన్నారు. వీరి ఏపీలో రిపోర్ట్ చేశాక సంబంధిత శాఖలకు ఇతర అధికారులతో భర్తీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.

వరంగల్ రాజకీయం వేడెక్కుతోంది. వరంగల్ కాంగ్రెస్ వార్ ఢిల్లీకి చేరింది. మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా ఒక్కటైన వరంగల్ కాంగ్రెస్ నేతలు నిన్న దీపాదాస్ మున్షీ, నేడు మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తాజాగా కేసీ వేణుగోపాల్ అపాయింట్ మెంట్ కోరారు వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రేపు ఢిల్లీకి వెళ్లి కొండా సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారులు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిసి రిలీవ్ ఆర్డర్స్ తీసుకున్నారు. ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్.. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వీరు క్యాట్ ను, తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు చోట్ల కూడా వీరికి చుక్కెదురైంది.

ఎట్టి పరిస్థితుల్లో డీవోపీటీ ఆదేశాలను అనుసరించి ఏపీకి వెళ్లాల్సిందేనని హైకోర్టు, క్యాట్ తేల్చి చెప్పడంతో.. చేసేదేమీ లేక తెలంగాణ నుంచి రిలీవ్ తీసుకున్నారు. రేపు ఏపీలో రిపోర్టు చేసే అవకాశం ఉంది. ఆమ్రపాలి, రొనాల్డ, వాణీ ప్రసాద్, వాకాటి కరుణ తెలంగాణలో కీలక శాఖల్లో ఉన్నారు. ఈ శాఖల నుంచి వారు రిలీవ్ అయిన నేపథ్యంలో ఆయా శాఖలను ఎవరికి కేటాయించాలి అనేదానిపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది.

ఇప్పటికే తెలంగాణలో ఐఏఎస్ అధికారుల కొరత ఉంది. తెలంగాణకు 220 మంది ఐఏఏస్ అధికారులు ఉండాలి. కానీ, ప్రస్తుతం 178 మంది మాత్రమే ఉన్నారు. ఐఏఎస్ ల కొరత నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వారికే ఇంఛార్జ్ లుగా బాధ్యతలు అప్పగించే పరిస్థితి కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ, విద్యుత్, ఉమెన్ అండ్ వెల్ఫేర్.. ఇవన్నీ కీలక శాఖలు. వీటి బాధ్యతలు ఎవరికి అప్పగించాలి అనేదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

 

Also Read : ఏనుగు మీద విసిరిన బాణం రివర్స్ కొట్టిందా? పరేషాన్‌లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి..!