ఐఏఎస్ సందీప్ కుమార్‌ ఝాకు మంత్రి ఊహించ‌ని ఝల‌క్.. ఏం జరుగుతోంది?

ఇంత‌లా వివాదాల‌ను త‌న వెంటేసుకుని తిరిగే ఆయనకు.. మంత్రి కోమ‌టిరెడ్డి గట్టి బ్రేక్ వేశారని గుసగుసలు పెట్టుకుంటున్నారు.

ఐఏఎస్ సందీప్ కుమార్‌ ఝాకు మంత్రి ఊహించ‌ని ఝల‌క్.. ఏం జరుగుతోంది?

Updated On : October 27, 2025 / 8:50 PM IST

IAS Sandeep Kumar Jha: ఐఏఎస్‌ అధికారిగా ఆయన ఓ వెలుగు వెలిగారు. సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్‌కుమార్‌ ఝా చెప్పిందే వేదం అన్నట్లు నడిచింది. ఈ క్రమంలో క‌లెక్టర్‌గా వెలుగువెలిగిన ఝాకు..సెక్రటేరియట్‌లోకి ఇప్పుడు నోఎంట్రీ అంటూ అడ్డంకులు ఏర్పడుతున్నాయట. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ప్రోటోకాల్ పాటించలేదని పలుసార్లు వివాదం అయింది.

లాస్ట్‌కు కలెక్టర్‌పై చర్యల కోసం బీసీ సంఘాలు రోడ్డు ఎత్తాయి. విప్ ఆది శ్రీనివాస్ సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సందీప్‌కుమార్ ఝాను సిరిసిల్ల నుంచి ట్రాన్స్‌ఫర్ చేసి..ఆర్ అండ్‌ బీ శాఖలో పోస్టింగ్‌ ఇచ్చారు. దీంతో ఏకంగా స‌చివాల‌యంలో చ‌క్రం తిప్పొచ్చని ఆశ‌ప‌డ్డ..సందీప్ కుమార్ ఝాకు..మంత్రి కోమ‌టిరెడ్డి వెంకట్‌రెడ్డి ఊహించ‌ని షాక్ ఇచ్చారట. దీంతో వివాదాస్పద అధికారిగా…ఐఎస్ఐ మార్క్ సొంతం చేసుకున్న సందీప్ కుమార్ ఝా… మ‌రోసారి వార్తల్లోకి ఎక్కారు.

Also Read: ఆ నేత రివర్స్ పొలిటికల్‌ గేమ్‌ ప్లాన్ చేశారా? పవన్‌కు దగ్గరయ్యేందుకు స్కెచ్ వేస్తున్నారా?

ఆ మధ్య జరిగిన బదిలీల్లో ఆర్ అండ్‌ బీ శాఖ‌కు స్పెష‌ల్ సెక్రట‌రీగా సందీప్‌ కుమార్‌ ఝాకు పోస్టింగ్‌ ఇచ్చింది ప్రభుత్వం. అయితే వివాదాస్పద ఆఫీస‌ర్‌గా పేరున్న, సందీప్ కుమార్‌ను తన శాఖకు వ‌ద్దంటే వ‌ద్దు అంటూ మంత్రి కోమ‌టిరెడ్డి అభ్యంత‌రం వ్యక్తం చేశారట. దీంతో ఆర్ అండ్‌ బీలో సందీప్ కుమార్ ఝా పోస్టింగ్ ఆగిపోయింది. మంత్రి మాట‌తో సీఎం చేసేదేం లేక సందీప్ కుమార్ పోస్టింగ్‌ను పెండింగ్‌లో పెట్టార‌ట‌. దీంతో సెక్రటేరియట్‌లోకి ఎంట్రీ అయిన సందీప్‌కు..ఫిఫ్త్ ప్లోర్‌లోకి ఎంట్రీ ఆగిపోయిందంటున్నారు. ఇదే ఇప్పుడు సెక్రటేరియట్‌లోని అధికారిక వ‌ర్గాల్లో చ‌ర్చనీయాంశ‌గా మారింది.

సందీప్ కుమార్ ఝా అంటేనే కాంట్రవర్సీకి కేరాఫ్‌!

అయితే సందీప్ కుమార్ ఝా అంటేనే కాంట్రవర్సీకి కేరాఫ్‌ అన్న టాక్ ఉంది. పొలిటిక‌ల్ లీడ‌ర్స్ తోనే కాదు..చివ‌రికి ఆయ‌న వ్యవ‌హార శైలిపై హైకోర్ట్ కూడా మొట్టికాయ‌లు వేసిన సంద‌ర్భం ఉంది. సిరిసిల్ల క‌లెక్టర్‌గా..మిడ్ మానేరు భూనిర్వాసితుల‌పై కేసులు పెట్టించడం..అది కాస్త హైకోర్టుకు చేర‌డంతో..న్యాయస్థానం సీరియ‌స్ అయ్యింది. విచారణకు హాజరైన సందీప్‌ కుమార్ ఝా డ్రెస్సింగ్‌పై కూడా తీవ్రంగా స్పందించింది కోర్టు. కేటీఆర్ ఫోటో పెట్టుకుని టీ స్టాల్‌ నడుపుతున్నాడని..ఓ టీ స్టాల్‌ను తీయించి విమర్శల పాలయ్యారు సందీప్‌కుమార్‌.

ఇంత‌లా వివాదాల‌ను త‌న వెంటేసుకుని తిరిగే ఆయనకు.. మంత్రి కోమ‌టిరెడ్డి గట్టి బ్రేక్ వేశారని గుసగుసలు పెట్టుకుంటున్నారు. సెక్రట‌రియేట్ గేట్ లోప‌లి దాకా వ‌చ్చిన సందీప్‌ను..ఐదో ఫ్లోర్‌లో అడుగు పెట్టకుండా అడ్డుకోవడం కోమ‌టిరెడ్డితోనే అయ్యిందని..ఎంత పెద్ద లీడర్లు అయినా ఓ ఆట ఆడించి వచ్చిన సందీప్‌కుమార్‌ ఝాకు..సెక్రటేరియట్‌కు వచ్చేసరికి పప్పులు ఉడకడం లేదన్నటాక్ అయితే వినిపిస్తోంది. ఏదైనా సందీప్‌ కుమార్‌ ఝాకు కోమటిరెడ్డి ఇచ్చిన ఝలక్‌..సరైందేనన్న చర్చ అయితే జరుగుతోంది.