ఆ నేత రివర్స్ పొలిటికల్‌ గేమ్‌ ప్లాన్ చేశారా? పవన్‌కు దగ్గరయ్యేందుకు స్కెచ్ వేస్తున్నారా?

ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై కూడా చెప్పారు. ఆ క్రమంలోనే ఆయన టీడీపీ లేకపోతే బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది.

ఆ నేత రివర్స్ పొలిటికల్‌ గేమ్‌ ప్లాన్ చేశారా? పవన్‌కు దగ్గరయ్యేందుకు స్కెచ్ వేస్తున్నారా?

Updated On : October 27, 2025 / 8:38 PM IST

Grandhi Srinivas: గ్రంధి శ్రీనివాస్‌.. గోదావరి జిల్లాలకు చెందిన ముఖ్యనేత, భీమవరం మాజీ ఎమ్మెల్యే. ఏడాదిగా ఆయన పొలిటికల్ యాక్షన్‌ హాట్ టాపిక్‌ అవుతోంది. గతేడాది వైసీపీకి రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన సైలెంట్‌గా ఉంటున్నారు. ఇప్పుడు సడెన్‌గా సైలెన్స్‌కు బ్రేక్ వేసి..మీడియా ముందుకు వచ్చేశారు. ఈ మధ్య చర్చనీయాంశమైన భీమవరం పేకాట శిబిరాల ఇష్యూపై వాయిస్ వినిపిస్తున్నారు.

ఆ అంశంలో పవన్‌కు మద్దతుగా నిలుస్తూ..జనసేనాని మనసు గెలిచేందుకు అస్త్రాన్ని బయటికి తీశారు గ్రంధి. భీమవరం డీఎస్పీ మంచివారే, రఘురామకృష్ణంరాజు చెప్పింది కరెక్టే అంటున్న ఆయన..డీఎస్పీపై పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారే తప్ప, ఆరోపణలు చేయలేదంటూ కవర్‌ డ్రైవ్ చేస్తున్నారు. 14 నెలలుగా ఒక్కో పేకాట క్లబ్బు నుంచి నెలకు రూ.10 లక్షల చొప్పున ఏయే ప్రజా ప్రతినిధులకు వెళ్లాయి అంటూ కొత్త చర్చకు తెరలేపారు. (Grandhi Srinivas)

అయితే భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును గ్రంధి టార్గెట్‌ చేస్తున్నారట. జనసేన ఎమ్మెల్యేను ఉద్దేశించే గ్రంధి ఈ వసూళ్ల ఆరోపణలు చేశారని అంటున్నారు. రాముడి పేరు పెట్టుకున్నవారంతా మంచి బాలుడు కాదనేది పవన్ కల్యాణ్ గ్రహించాలని అంటున్నారు గ్రంధి శ్రీనివాస్‌. దీంతో ఆయన రామాంజనేయులును కార్నర్ చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది.

Also Read: క్యాబినెట్ దండుపాళ్యం ముఠాలా తయారైందన్న హరీశ్.. సీఎం, మంత్రుల మధ్య టగ్‌ ఆఫ్‌ వార్ నడిచిందా?

పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ ఇస్తే అన్ని విషయాలు వివరిస్తానంటున్నారు. జిల్లా కేంద్రం భీమవరం నుంచి తరలించేందుకు ఎమ్మెల్యే రామాంజనేయులు కుట్ర చేస్తున్నారని..ఎట్టి పరిస్థితుల్లో జిల్లా కేంద్రం భీమవరం నుంచి తరలిపోనివ్వమంటున్నారు.

ఏ పార్టీతోనూ సంబంధం లేదంటూ..

గత ఏడాది డిసెంబర్‌లో వైసీపీకి రిజైన్ చేసిన తర్వాత..ఏ పార్టీతో సంబంధం లేదంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు గ్రంధి శ్రీనివాస్‌. కాపు సామాజికవర్గానికి చెందిన గ్రంధి శ్రీనివాస్‌కు ఆ వర్గంలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. అయితే వైసీపీలో ఆయనకు పెద్దగా గుర్తింపు దక్కలేదని అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించినా ఆయన ఆశ నెరవేరలేదు. ఈ క్రమంలో వైసీపీ ఓడినప్పటి నుంచి పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉంటున్నారు.

పైగా ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై కూడా చెప్పారు. ఆ క్రమంలోనే ఆయన టీడీపీ లేకపోతే బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. బీజేపీ కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ గ్రంధి ఇంటికి వెళ్లి కలిశారు. దీంతో ఆయన బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన కాషాయ పార్టీలోకి వెళ్లేందుకు ఇష్టంగా లేరట. జనసేనలో చేరేందుకే ఉవ్విళ్లూరుతున్నారట గ్రంధి.

కానీ భీమవరంలో జనసేనకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన్ను కాదని గ్రంధిని చేర్చుకునే అవకాశం లేదన్న టాక్ వినిపిస్తోంది. అందుకే పేకాట శిబిరాల ఇష్యూలో పులపర్తి రామాంజనేయులు టార్గెట్‌గా..పవన్‌కు అండగా గ్రంధి వాయిస్ వినిపిస్తున్నారని టాక్. జనసేనలోకి వెళ్తే వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేయొచ్చనేది గ్రంధి శ్రీనివాస్‌ ఆలోచన అని అంటున్నారు. అందుకు అడ్డంకిగా ఉన్న రామాంజనేయులు మీదే కత్తులు దవ్వుతున్నారని.. పవన్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తే అన్నీ చెప్తా అనేది.. రామాంజనేయులు మీద కంప్లైంట్ చేసేందుకే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో గోదావరి గట్టున రాజకీయం మారుతోంది. కీలక సమీకరణాలు చేంజ్‌ అవుతున్నాయి. భీమవరం డీఎస్పీ జయసూర్యపై విచారణ కోసం పవన్ ఫిర్యాదు చేయటం..రఘురామ వ్యాఖ్యలు చర్చగా మారాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై 2019 ఎన్నికల్లో పవన్‌ను ఓడించిన గ్రంధి శ్రీనివాస్ స్పందించడం చర్చకు దారితీస్తోంది.

రఘురామ చెప్పింది నిజం..పవన్ వ్యాఖ్యల్లో తప్పులేదంటూ గ్రంధి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే గ్రంధి సమయం సందర్భం చూసి మరీ కామెంట్స్ చేయడం వెనుక పక్కా పొలిటికల్ ప్లాన్ ఉందని అంటున్నారు. ఆయన జనసేన గూటికి వెళ్లేందుకు రూట్ క్లియర్ చేసుకునే పనిలో పడ్డారట. ఇదే అదునుగా పేకాట శిబిరాల అంశాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని..పులిపర్తి రామాంజనేయులు మీద బాణాలు ఎక్కుపెడుతున్నారట. గ్రంధి శ్రీనివాస్‌ పొలిటికల్‌ గేమ్‌ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.