TRS MLAs Trap Issue : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం .. యాదాద్రిలో తడిబట్టలతో బండి సంజయ్ ప్రమాణం

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమకు ఎటువంటి సంబంధంలేదని బండి సంజయ్ ప్రమాణం చేశారు. యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ప్రమాణం చేశారు. ఫామ్ హౌస్ డీల్ కాదని ఈ సందర్భంగా స్వామి వారి పాదాల దగ్గర బండి సంజయ్ ప్రమాణం చేశారు.

TRS MLAs Trap Issue : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం .. యాదాద్రిలో తడిబట్టలతో బండి సంజయ్  ప్రమాణం

Updated On : October 28, 2022 / 5:51 PM IST

TRS MLAs Trap Issue : టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు వ్యవహారం తెలంగాణలో రచ్చ రచ్చగా మారింది. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు..విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంతా కేసీఆర్ కుట్రే అని బీజేపీ ఆరోపిస్తుంటే బీజేపీ దిరజారుడుతనానికి ఇదో ఉదాహరణ అంటూ టీఆర్ఎస్ మండిపడుతోంది. ఈక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమకు ఎటువంటి సంబంధం లేదంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ యాద్రాద్రి నరసింహ స్వామి సాక్షిగా ప్రమాణం చేశారు. ఈరోజు యాదాద్రి వెళ్లిన బండి సంజయ్ తడిబట్టలతో యాదాద్రీశ్వరుడి సన్నిధిలో ప్రమాణం చేశారు. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ కు ఎటువంటి సంబంధం లేదనే చిత్రశుద్ది ఉంటే కేసీఆర్ కూడా యాదాద్రిలో ప్రమాణం చేయాలని బండి సవాల్ విసిరారు.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమకు ఎటువంటి సంబంధంలేదని బండి సంజయ్ ప్రమాణం చేశారు. ఈ మేరకు ఆయన యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ప్రమాణం చేశారు. ఫామ్ హౌస్ డీల్ కాదని ఈ సందర్భంగా స్వామి వారి పాదాల దగ్గర బండి సంజయ్ ప్రమాణం చేశారు. ఫామ్ హౌస్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసిన బండి సంజయ్… ఆ విషయంపై తాను యాదాద్రిలో ప్రమాణం చేస్తానని.. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే ఆయన కూడా వచ్చి ప్రమాణం చేయాలని పిలుపునిచ్చారు.

తాను చెప్పినట్లుగా శుక్రవారం బండి సంజయ్ యాదాద్రి బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి ఆయనకు ఒకింత అడ్డగింత ఎదురైంది. మరోవైపు బండి సంజయ్ కంటే ముందే యాదాద్రి చేరిన టీఆర్ఎస్ శ్రేణులు అక్కడ వెలసిన బీజేపీ జెండాలను చించేశాయి. అయితే ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తాను యాదాద్రి వెళ్లి తీరతానని సంజయ్ తేల్చిచెప్పారు. అనుకున్నట్లుగానే శుక్రవారం మధ్యాహ్నానికి యాదాద్రి చేరిన సంజయ్… ఆలయ స్నానఘట్టంలో స్నానమాచరించి… తడిబట్టలతోనే లక్ష్మీనరసింహ స్వామి వారి పాదాల వద్దకు చేరి ప్రమాణం చేశారు.