Temperatures : తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడి భగభగలు.. జాగ్రత్త అంటున్న వాతావరణ శాఖ

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. ఎండవేడికి తట్టుకోలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బకు గత నాలుగు రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు మృతి చెందారు...

Temperatures : తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడి భగభగలు.. జాగ్రత్త అంటున్న వాతావరణ శాఖ

Telugu States

Increased Temperatures In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. ఎండవేడికి తట్టుకోలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బకు గత నాలుగు రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. ఉదయం 8గంటల నుంచే సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. నిర్మల్‌, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. కొమురంభీం జిల్లా కెరమెరిలో 45.8, నిర్మల్ జిల్లా కడెంలో 45.7, ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో 45.4, ఆదిలాబాద్ చెప్రాల్‌లో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 41డిగ్రీలు దాటింది.

Read More : Ragi Ambali : వేసవిలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గించే రాగి అంబలి!

ఆంధ్రప్రదేశ్‌లోనూ సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులతో జనాలు అల్లాడిపోతున్నారు. నాలుగైదు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 2 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. 100 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 571 మండలాల్లో ఉష్ణతాపం ఎక్కువగా ఉంటుందని సూచించింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, గుంటూరు, ఎన్టీఆర్‌ విజయవాడ, పల్నాడు, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని ఎక్కువ మండలాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటోంది.

Read More : Heat Wave Alert : ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు.. వచ్చే 4 రోజులు జాగ్రత్త..!

ఏపీలోని అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకున్నాయి. తిరుపతి,కడప, కర్నూలు, విజయవాడ, ప్రకాశం జిల్లాలో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అక్కడ రోజుకు సగటున 44-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో.. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటం మంచిదని సూచిస్తున్నారు..వాతావరణశాఖ అధికారులు. ముందు జాగ్రత్తగా డీహైడ్రేట్‌ కాకుండా ఓఆర్‌ఎస్‌, నిమ్మకాయ నీరు, లస్సీ, మజ్జిగ, కొబ్బరినీరు తాగాలని చెబుతున్నారు.