injection Attack In Adilabad : ఆదిలాబాద్ జిల్లాలో మత్తు ఇంజెక్షన్ దాడి .. బైక్‌పై వచ్చి యువకుడిని ఇంజెక్షన్‌తో పొడిచి పారిపోయిన దుండగులు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో మత్తు ఇంజెక్షన్ దాడి కలకలం రేగింది. ఇచ్చోడ మండలం హరినాయక్ తండాలోని ఓ బస్టాప్‌లో నిల్చొని ఉన్న ఓ యువకుడిపై మత్తు ఇంజెక్షన్ పొడొచి పరారయ్యారు దుండగులు. ఇంజెక్షన్ ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురైన యువకుడు రోడ్డుమీద పడిపోయాడు.

injection Attack In Adilabad
injection Attack In Adilabad : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో మత్తు ఇంజెక్షన్ దాడి కలకలం రేగింది. ఇచ్చోడ మండలం హరినాయక్ తండాలోని ఓ బస్టాప్‌లో నిల్చొని ఉన్న ఓ యువకుడిపై మత్తు ఇంజెక్షన్ పొడొచి పరారయ్యారు దుండగులు. ఇంజెక్షన్ ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురైన యువకుడు రోడ్డుమీద పడిపోయాడు. అది గమనించిన స్థానికులు యువకుడిని అంబులెన్స్ లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
బాధితుడు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు రిమ్స్ డాక్టర్లు బాధితుడికి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక.. మత్తు ఇంజెక్షన్ దాడికి గురైన యువకుడుని శ్రీకాంత్ గా గుర్తించారు. ఆ ఇంజెక్షన్ దాడికి పాల్పడిన వ్యక్తులు స్థానికులు కాదని వారిని ఎప్పుడు అక్కడ చూడలేదని చెబుతున్నారు స్థానికులు.
కాగా..ఈ ఇంజెక్షన్ దాడి విషయం ఆ నోట ఈ నోట ప్రచారం కావడంతో స్థానికులు.. తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ దాడిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్ మీద వచ్చి శ్రీకాంత్ పై ఎందుకు దాడి చేశారు? వారు ఎవరు?ఎందుకు దాడికి పాల్పడ్డారు? లేదా పాత కక్షలేమన్నా ఉన్నాయా?ఏమి ఆశించి ఈ దాడి చేశారు?అనే పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.