Telangana : మా బాస్‌ను ఒక్కమాట అంటే వంద మాటలంటాం.. నేను కేసీఆర్‌ను ఏమి అనలేదు
మా గురించి చానా మాట్లాడుతున్నావు ఏంటి..? అని ఎమ్మెల్యే రాజగోపాల్ ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అవును మా బాస్ ను ఒక్క మాట అంటే 100...

Trs And Congress
Jeevan Reddy and Rajagopal Reddy : మా గురించి చానా మాట్లాడుతున్నావు ఏంటీ ? అవును మా బాస్ ను ఒక్క మాట అంటే వంద మాటలంటాం.. నేను సీఎం కేసీఆర్ ను ఏమి అనలేదు అన్నా… ఈ ఆసక్తికర సంభాషణ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిల మధ్య చోటు చేసుకుంది. సీఎల్పీ కార్యాలయంలో వీరు ఎదురయ్యారు. దీంతో ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు.
Read More : Minister KTR : కంటోన్మెంట్ అధికారులకు కేటీఆర్ వార్నింగ్.. ‘మంచినీళ్లు, కరెంట్ బంద్ చేస్తాం’
జీవన్.. మా గురించి చానా మాట్లాడుతున్నావు ఏంటి..? అని ఎమ్మెల్యే రాజగోపాల్ ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అవును మా బాస్ ను ఒక్క మాట అంటే 100 మాటలంటాము.. బరాబర్ గా అంటామన్నారు. నేను సీఎం కేసీఆర్ ను ఏం అనలేదు.. మీడియా వాళ్లు ప్రశ్నిస్తే.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూశాను మాత్రమే అన్నా అని రాజగోపాల్ రెడ్డి జవాబు ఇచ్చారు. అసలు సీఎం కేసీఆర్ హాస్పిటల్ కు వెళ్లిన విషయం తెలియదన్నారు జీవన్ రెడ్డి. తనకు పై నుంచి ఆదేశాలు ఉన్నందునే .. నిన్ను తిట్టాను అని చెప్పారు.
తెలంగాణ మేము తెస్తే మమ్మల్నే తిడుతున్నారని రాజగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి త్యాగం చేసినందుకు మీ కుటుంబం పై తమకు గౌరవం ఉందని, సోనియా గాంధీని ఎప్పుడూ విమర్శించం.. ఎందుకంటే ఆమె తెలంగాణ ఇచ్చిన దేవత.. తాము కేవలం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ను తిడతామన్నారు జీవన్ రెడ్డి.
తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారంలోకి రాదు.. మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని జీవన్ రెడ్డి అన్నారు. అనంతరం ఇరువురు నేతలు ఎవరి దారి వెళ్లిపోయారు.