అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే దారుణం : అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్తకుండీలో పడేశారు

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్త కుండీలో పడేశారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే దారుణం : అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్తకుండీలో పడేశారు

International Womens Day A Newborn Baby Girl Dumped In A Garbage

Updated On : June 18, 2021 / 4:18 PM IST

newborn baby girl dumped in a garbage : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే దారుణం జరిగింది. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఆడపిల్ల పుట్టిందని వద్దనుకున్నారో లేక.. అమ్మాయని వివక్ష చూపారో తేలీదు కానీ.. అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్త కుండీలో పడేశారు కసాయి తల్లిదండ్రులు.

బతికున్న శిశువునే గోనెసంచిలో చుట్టి రోడ్డుపక్కన పడేశారు. శిశువు కేకలు వేయడంతో.. అటుగా వెళ్లున్న వ్యవసాయ కూలీలు గుర్తించి.. ఆ పసిగుడ్డను ఆస్పత్రికి తరలించారు. శిశువు పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు చెబుతుండగా.. ఘటనపై డోర్నకల్‌ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.