Eatala Rajender : రాజాసింగ్ ఇంటికి వెళ్లిన ఈటల రాజేందర్‌పై హైకమాండ్ సీరియస్, ఇది కరెక్ట్ కాదని మండిపాటు

ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకత్వం భగ్గుమంది. ఈటలను మందలించింది. (Eatala Rajender)

Eatala Rajender : రాజాసింగ్ ఇంటికి వెళ్లిన ఈటల రాజేందర్‌పై హైకమాండ్ సీరియస్, ఇది కరెక్ట్ కాదని మండిపాటు

Eatala Rajender (Photo : Twitter)

Updated On : July 19, 2023 / 7:15 PM IST

Eatala Rajender – Raja Singh : తెలంగాణ బీజేపీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇరుకున పడ్డారు. పార్టీ హైకమాండ్ ఆగ్రహానికి గురయ్యారు. ఈటల రాజేందర్ పై జాతీయ నాయకత్వం సీరియస్ అయ్యింది. మీరు చేసింది కరెక్ట్ కాదని మండిపడింది. అసలేం జరిగిందంటే.. ఈటల రాజేందర్ బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికి వెళ్లారు. ఆయనతో కాసేపు మాట్లాడారు. అంతే, ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకత్వం భగ్గుమంది. ఈటలను మందలించింది.

ఈటల రాజేందర్.. రాజాసింగ్ ను‌ కలవటంపై జాతీయ నాయకత్వం మండిపడింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్ ఇంటికి ఈటల వెళ్లడం పార్టీ పెద్దలకు కోపం తెప్పించింది. సస్పెండ్ చేసిన రాజాసింగ్ ఇంటికి వెళ్ళడం సరికాదని ఈటలకు హితవు పలికారు పార్టీ పెద్దలు. ఒక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ గత ఆగస్టులో రాజాసింగ్ ను బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read: బీఆర్‌ఎస్‌లో హీట్ పుట్టిస్తున్న తాండూరు పాలిటిక్స్.. కాంగ్రెస్, బీజేపీ ప్లానేంటి?

బోనాల పండగ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య గోషామహాల్ లో గొడవ జరిగింది. మంగళ్ హాట్ డివిజన్ లో ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంగళ్ హాట్ బీజేపీ కార్పొరేటర్ శశికళపై పోలీసులు వన్ సైడ్ గా కేసులు నమోదు చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మంగళ్ హాట్ కార్పొరేటర్ శశికళను రాజాసింగ్ నివాసంలో ఈటల రాజేందర్ పరామర్శించారు. బీఆర్ఎస్ నేతలతో ఫ్లెక్సీ గొడవపై కార్పొరేటర్ శశికళను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈటల. ఆ తర్వాత ఎమ్మెల్యే రాజాసింగ్ తో కాసేపు మాట్లాడారు. రాజాసింగ్, ఈటల రాజేందర్ సమావేశమైన వీడియో, విజువల్స్ లీక్ అయ్యాయి. ఇది హైకమాండ్ దృష్టికి వెళ్లింది. దాంతో వారు ఈటల తీరుపై మండిపడ్డారు. ఎన్నికల‌ మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ తీరుని బీజేపీ హైకమాండ్ తప్పు పట్టింది. కాగా, రాజాసింగ్, ఈటల ఎపిసోడ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: మహేశ్వరం నియోజకవర్గంలో ఈసారి పోటీకి దిగేదెవరు.. త్రిముఖ పోరు తప్పదా?