Hyderabad : చంద్రబాబు అరెస్ట్.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల నిరసన, అక్రమ అరెస్ట్ అంటూ ఆగ్రహం

ఐయామ్ విత్ సీబీఎన్ పేరిట ఉద్యోగులు నిరసనకు దిగారు. ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించారు. Hyderabad

Hyderabad : చంద్రబాబు అరెస్ట్.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల నిరసన, అక్రమ అరెస్ట్ అంటూ ఆగ్రహం

IT Employees Protest

Updated On : September 13, 2023 / 8:25 PM IST

Hyderabad – Chandrababu Arrest : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఐటీ ఉద్యోగులు భగ్గుమన్నారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా వందలాది మంది ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ విప్రో సర్కిల్ వద్ద మానవహారం నిర్మించారు. చంద్రబాబు అరెస్ట్ ను నిరసించారు.

ఐయామ్ విత్ సీబీఎన్ పేరిట ఉద్యోగులు నిరసనకు దిగారు. ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఉద్యోగుల నిరసనకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఉద్యోగులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో విప్రో సర్కిల్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని ఐటీ ఉద్యోగులు నినాదాలు చేశారు. జై సీబీఎన్, జై బాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు.

Also Read..Rajinikanth : చంద్రబాబు అరెస్ట్ పై రజనీకాంత్ రియాక్షన్, కీలక వ్యాఖ్యలు చేసిన సూపర్ స్టార్

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. అధికార, విపక్షాల మధ్య చిచ్చు రాజేసింది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని, ఇది రాజకీయ కక్ష సాధింపు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

సరిగ్గా ఎన్నికల వేళ చంద్రబాబుని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు సీఎం జగన్ కుట్రపన్నారని అంటున్నారు. టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ నేతలు ఖండించారు. చంద్రబాబు స్కామ్ చేశారని, అందుకే అరెస్ట్ అయ్యారని అంటున్నారు. చంద్రబాబు చేసిన స్కామ్ కి సాక్ష్యాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇదే కాదు ఇంకా చాలా స్కామ్ లు ఉన్నాయని, అవన్నీ బయటకు వస్తాయని అంటున్నారు.

Also Read..Chandrababu: చంద్రబాబుకు ఇండియా కూటమి ఆపన్న హస్తం.. సేఫ్ గేమ్ ఆడేందుకే సీబీఎన్ మొగ్గు!