Jagga Reddy: అందుకే దీనికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గళం విప్పారు: జగ్గారెడ్డి

అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.

Jagga Reddy: అందుకే దీనికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గళం విప్పారు: జగ్గారెడ్డి

Updated On : December 20, 2024 / 5:23 PM IST

అంబేద్కర్‌ను కేంద్ర మంత్రి అమిత్ షా అవమానించేలా మాట్లాడారని, దీంతో దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గళం విప్పారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

“పార్లమెంట్ నిండు సభలో అంబేద్కర్ ను అవమానించేలా అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొనే వరకు రాహుల్ గాంధీ పోరాటం చేస్తారు. చట్టాలు, న్యాయాలు అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఉన్నాయి.

బీసీలుగా చెప్పుకునే మోదీ, అమిత్ షా కూడా అంబేద్కర్ రాజ్యాంగం వల్లే పదవులు పొందారు. అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుస్తోంది. దేశ ప్రజల భావాలు దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు.

రాహుల్ గాంధీ బాధ్యత గాంధీ, నెహ్రూ అడుగుజాడల్లో నడవటం. అంబేద్కర్ రాజ్యాంగం వేరు భగవంతుడు వేరన్న విషయాన్ని అమిత్ షా గుర్తించాలి. అమిత్ షాకి బీజేపీ, రాహుల్ గాంధీకి తేడా.. రాహుల్ గాంధీ దేవుని మొక్కుతాడు పబ్లిసిటీ చెయ్యరు..
కానీ బీజేపీ నేతలు దేవుడిని మొక్కితే పబ్లిసిటీ చేసుకుంటారు. దేవుడు అనేది నమ్మకం, ధైర్యం.. భగవంతుడు అనేది వ్యక్తిగత విషయం” అని జగ్గారెడ్డి తెలిపారు.
స్మగ్లర్లు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం: చంద్రబాబు వార్నింగ్