స్మగ్లర్లు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం: చంద్రబాబు వార్నింగ్
ధాన్యం సేకరణ కేంద్రానికి ఇవాళ చెప్పి వచ్చినట్లు.. ఇకపై చెప్పి రానని చంద్రబాబు అన్నారు.

CM Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ సమీపంలోని పెనమలూరు నియోజకవర్గం గంగూరు, ఈడుపుగల్లు గ్రామాల్లో అన్నదాలతో మాట్లాడారు. ఆ తర్వాత రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో స్మగ్లింగ్‌కి చోటు లేదని చెప్పారు. స్మగ్లర్ అనే వాడి మాట లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. బియ్యం అక్రమ రవాణాను అరికట్టి తీరుతామని చెప్పారు. బియ్యం స్మగ్లింగ్, రీసైక్లింగ్ విషయంలో కఠినంగా ఉంటామని తెలిపారు.
ధాన్యం సేకరణ కేంద్రానికి ఇవాళ చెప్పి వచ్చినట్లు.. ఇకపై చెప్పి రానని చంద్రబాబు అన్నారు. ఆకస్మిక తనిఖీలతో ఇకపై సడన్ విజిట్స్ పెంచుతానని స్పష్టం చేశారు. సాంకేతికత సక్రమ వినియోగంతో రైతుల ఖర్చు తగ్గించి ఎక్కువ లాభం వచ్చేలా చేస్తామని తెలిపారు.
ఎలాంటి పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుందో కూడా రైతులకు అవగాహన పెంచుతామని చంద్రబాబు చెప్పారు. లాభసాటి వ్యవసాయంపై రైతుల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున చర్చలు చేపడతామని అన్నారు. ఐవీఆర్ఎస్ ఫిర్యాదుల్లో చెప్పినట్లే గోను సంచుల సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. దళారీ ముసుగులో రైతులకు ఎవరు అన్యాయం చేయాలని చూసినా ఉపేక్షించనని చెప్పారు.
గత వైసీపీ హయాంలో ఈ వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయో తెలియదు: పవన్ కల్యాణ్