Janasena: తెలంగాణలో దూకుడు పెంచిన జనసేన.. మున్సిపల్ ఎన్నికలపై కమిటీ నియామకం
ఈ కమిటీలోని ఒక్కో సభ్యుడికి ఉమ్మడి జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించారు.
Janasena Representative Image (Image Credit To Original Source)
- మున్సిపల్ ఎన్నికలపై జనసేన ఫోకస్
- ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ నియామకం
- కమిటీలో 11 మందికి చోటు
Janasena: తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఓ అడుగు ముందుకు పడింది. ఎన్నికల కోసం కో-ఆర్డినేషన్ కమిటీని నియమించారు పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్. ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీలో 11మందికి చోటు కల్పించారు. ఈ కమిటీలోని ఒక్కో సభ్యుడికి ఉమ్మడి జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. సాధ్యమైనన్ని స్థానాల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పూనాది వేస్తామంటూ జనసేన తెలిపింది. తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో ప్రతి జన సైనికుడు, వీరమహిళ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చింది.
పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ అధినేత పవన్ భావజాలాన్ని, ఆశయాలను, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయనకున్న అనుబంధాన్ని ప్రజలకు చేరవేయడం, తద్వారా తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి.
Also Read: ఈసారి పవన్ వార్నింగ్ అందరికీ గుచ్చుకున్నట్లేనా.? పవన్ నోట పదేపదే అదే మాట
