janata curfew : నేను చప్పట్లు కొడుతా..మీరు కొట్టాలి – KCR

కరోనా వైరస్ కట్టడి చేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు జనతా కర్ఫ్యూ సక్సెస్ గా కొనసాగుతోంది. 2020, మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటించాలని, ఇళ్లలోనే ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు.
అయితే..దీనికి సపోర్టు ఇస్తూనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 14 గంటలు కాదు…24 గంటల పాటు బంద్ పాటించి..దేశానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా..ఆదివారం ప్రజలు ఇళ్లల్లోనే పరిమితమయ్యారు. 2020, మార్చి 21వ తేదీ శనివారం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
ప్రజలు ఐక్యత ప్రదర్శించాలని ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగంగా..ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇంటి ముందట వచ్చి చప్పట్లు కొట్టాలని సూచించారు. తనతో పాటు..కుటుంబసభ్యులు కూడా చప్పట్లు కొడుతారన్నారు. ఎక్కడ ఉన్నోళ్లు అక్కడ 2 నిమిషాలు..వీలైతే..ఇంకా ఎక్కువ సేపు చప్పట్లు కొట్టాలన్నారు.
ఐక్యతతో కరోనా వైరస్ మహమ్మారి..పారిపోవాలన్నారు. అంతేగాకుండా..సాయంత్రం 5గంటలకు రాష్ట్ర వ్యాప్తంగ సైరన్ మ్రోగించే ఏర్పాట్లు చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రజలు అందరూ చప్పట్లు కొట్టాలని సూచించారు.
కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కేసీఆర్ వ్యాఖ్యలు..
* ఈ వైరస్ ప్రారదోలడానికి ఎన్ని కోట్లు అయినా..ఖర్చు చేస్తాం.
* వైరస్ సోకిన వారికి చికిత్స చేస్తున్న వైద్యులను అభినందిస్తున్నా. వీరికి వైరస్ సోకకుండా ఉండేందుకు..అవసరమైన సామాగ్రీ తెప్పించాం. అవసరమైన పీపీ యూనిట్లు తెప్పించాం.
* ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినా..తెలంగాణ బిడ్డలను కాపాడుకుంటాం.
* మందులు, నిత్యావసర సరుకులు తదితరాలకు 100 శాతం ప్రభుత్వమే భరిస్తుంది.
* మహారాష్ట్రలో పెరిగిపోతున్న కేసుల దృష్ట్యా ఆ రాష్ట్ర సరిహద్దులు మూసివేస్తాం. దీనిపై రెండు..మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం.
* ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులను సరిహద్దులోనే ఆపివేస్తాం.
* కఠిన సమయంలో కఠినంగా ఉండాలి. సంకట పరిస్థితుల్లో స్వీయ నియంత్రణ కాపాడుతుంది.