Maganti Sunitha: అంతు చూస్తామని బెదిరించారు.. విచ్చలవిడిగా డబ్బులు పంచారు- మాగంటి సునీత
నేను ఎక్కడకి వెళ్ళినా నన్ను 100 మంది ఫాలో అవుతున్నారని చెప్పారు.
Maganti Sunitha: కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. మీడియాతో మాట్లాడిన ఆమె కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై విరుచుకుపడ్డారు. బైపోల్స్ లో కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచారని ఆరోపించారు. మహిళ అని చూడకుండా.. రేపు నీ సంగతి చూస్తామంటూ నన్ను కూడా బెదిరిస్తున్నారని చెప్పారు. రౌడీయిజం చేస్తున్న వారి సంగతి 14 తేదీన చెప్తామని ఆమె అన్నారు. ఏడిస్తే ఏడుస్తున్నాను అంటున్నారు.. నవ్వితే నవ్వినా అంటున్నారు.. మనుషులకు బాధ రాదా? అని ఆమె ప్రశ్నించారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అనుచరుడు సురేష్ యాదన్.. నీ అంతు చూస్తా అంటూ నన్ను బెదిరించాడని మాగంటి సునీత ఆరోపించారు. ఓటు వేసేందుకు వస్తున్న మహిళలను కరెంట్ బిల్లులు తీసుకురమ్మంటున్నారని చెప్పారు. యూసుఫ్ గూడ సవేవా ఫంక్షన్ హాల్ లో వందల మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. మంత్రి భట్టి విక్రమార్కు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రౌండ్స్ వేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఐలయ్య యాదవ్ కు జూబ్లీహిల్స్ లో ఏం పని? అని సునీత అడిగారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆకు రౌడీల సంగతి చూస్తామన్నారు. కాంగ్రెస్ నేతలకు పోలీసులు భయపడాల్సిన అవసరం ఏంటన్నారు.
పోలీసులు తటస్థంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ నేతలు బిర్యానీలో డబ్బులు పెట్టి ఓటర్లకు ఇస్తున్నా.. పోలీసులు చోద్యం చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలను ఇంటి నుంచి బయటకు రానివ్వటం లేదన్నారు. నవీన్ యాదవ్ గెలిస్తే భవిష్యత్తులో రౌడీయిజం తప్పదని ఆమె హెచ్చరించారు. నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ స్వయంగా డబ్బులు పంచుతున్నారని మాగంటి సునీత ఆరోపించారు. నేను ఎక్కడకి వెళ్ళినా నన్ను 100 మంది ఫాలో అవుతున్నారని చెప్పారు. బైపోల్స్ లో రౌడీ షీటర్లు తిరుగుతున్నారని మాగంటి సునీత ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్య ఉద్యోగం: సీఎం రేవంత్ రెడ్డి
