Junior Doctors : బిగ్ బ్రేకింగ్..టి.సర్కార్‌కు జూనియర్ డాక్టర్ల అల్టిమేటం..15 జీతం పెంచండి

Junior Doctors
Telangana Government : భారతదేశాన్ని కరోనా భూతం పట్టి పీడిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కోవిడ్ రోగులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో..జూనియర్ డాక్టర్లు తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. రెండు వారాల్లో సమస్యలు పరిష్కరించుకుంటే..సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించడం చర్చనీయాంశమైంది.
ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం..15 జీతం పెంచాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా..10 శాతం ఇన్సెంటివ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కోవిడ్ డ్యూటీలు చేసే హెల్త్ కేర్ వర్కర్స్ వైరస్ బారిన పడితే..నిమ్స్ లో వైద్యం అందించేలా జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా విధుల్లో మృతి చెందిన వారికి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలంటున్నారు జుడాలు.
తెలంగాణ రాష్ట్రంలో రోగులకు వైద్యం చేస్తున్న వారు చాలా మంది చనిపోయారని, గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇంతవరకు అమలు చేయడం లేదంటున్నారు. జీవోలు కేవలం కాగితాల వరకు మాత్రమే పరిమితమవుతున్నాయని జుడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read More : Heart Attacks : హార్ట్ అటాక్ వచ్చే వారిలో లక్షణాలేంటో తెలుసా..