Telangana High Court: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయన్

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులయ్యారు. గత నెల మేలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా.. రాష్ట్రపతి ఉత్తర్వులు మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి గెజిట్ విడుదల చేసింది. హైకోర్టు సీజేగా నియామకమైన ఉజ్జల్‌ భుయాన్‌ ప్రస్తుతం తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలోనే సేవలందిస్తున్నారు.

Telangana High Court: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయన్

Ts High Court

Updated On : June 19, 2022 / 6:43 PM IST

Telangana High Court: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులయ్యారు. గత నెల మేలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా.. రాష్ట్రపతి ఉత్తర్వులు మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి గెజిట్ విడుదల చేసింది. హైకోర్టు సీజేగా నియామకమైన ఉజ్జల్‌ భుయాన్‌ ప్రస్తుతం తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలోనే సేవలందిస్తున్నారు.

YS Sharmila: ఇదే నా నియోజకవర్గం.. పోటీ చేసేది ఇక్కడి నుంచే.. ప్రకటించిన షర్మిల..

ఉజ్జల్‌ భుయాన్‌ 1964 ఆగస్ట్‌ 2న గువాహటిలో జన్మించారు. గువాహటిలోని డాన్‌బాస్కో పాఠశాలలో విద్యనభ్యసించారు. స్థానిక ప్రభుత్వ న్యాయకళాశాల నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. ఆయన గువాహటి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. 2010లో గువాహటి హైకోర్టు సీనియర్‌ న్యాయవాదిగా చేరారు. 2011లో అసోం అదనపు ఏజీగా, అదే సంవత్సరం అక్టోబర్‌లో గువాహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియామకమయ్యారు.

UP bulldozer baraat: యోగి ఇలాకాలో.. ముస్లిం జంట వివాహంలో ‘బుల్డోజర్ బరాత్’..

2019లో బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. 2021 అక్టోబర్‌ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. తాజాగా సుప్రింకోర్టు కొలీజియం సిఫారసు మేరకు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలంగాణ హైకోర్టు సీజేగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా కొనసాగుతున్న సతీశ్‌ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు.