K A Paul Comments: అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఆవిర్భావ వేడుకలు బహిష్కరించండి
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు ఆవిర్భావ వేడుకలు బహిష్కరించాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.

Paul
K A Paul Comments: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, ఇతర పార్టీలేవీ అభివృద్ధి సాధించలేదని, తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానంటూ కేఏ పాల్ చెప్పుకొస్తున్నారు. అటు అధికార టీఆర్ఎస్ తో పాటు, ఇటు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపైనా పాల్ విమర్శలు గుపిస్తున్నారు. ఈక్రమంలో బుధవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్..సీఎం కేసీఆర్ పైనా విమర్శలు గుప్పించారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం..కెసిఆర్ కుటుంబ దినోత్సవంగా మారిందని కానీ తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలు చీకటిలో ముగ్గుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు.
other stories: Tamil Nadu: శశికళ మా పార్టీలో చేరొచ్చు: బీజేపీ
తెలంగాణ సాధనలో అమరులైన వారి కుటుంబాల బాధ ఎప్పటికి తీరుతుందని ప్రశ్నించిన కేఏ పాల్..వారి గోస వింటుంటే గుండె తరుక్కుపోతుందని..కన్నీళ్లు ఆగడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం1200 మంది అమరులైతే..టీఆర్ఎస్ సర్కార్ కనీసం ఆయా కుటుంబాలను పట్టించుకున్న దాఖలాలు లేవని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఎనిమిదేళ్లలో కేసీఆర్ చేసిందేమీలేదని.. త్యాగాలు అమరుల కుటుంబాలకు..భోగాలు కెసిఆర్ కుటుంబానివా అంటూ మండిపడ్డారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు ఆవిర్భావ వేడుకలు బహిష్కరించాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.
other stories: Telangana formation day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: తమిళిసై