తెలంగాణ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా బాబూ మోహ‌న్‌ను నియమించిన కేఏ పాల్.. రేవంత్ స‌ర్కార్‌పై విమర్శలు

గతంలో హైదరాబాద్ కు కంపెనీలు తచ్చింది నేనే. అది చంద్రబాబు నాయుడుకుకూడా తెలుసు. అప్పుల ఊబిలో కూరుకపోయిన తెలంగాణను అభివృద్ధి చేయాలంటే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కేఏ పాల్ ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా బాబూ మోహ‌న్‌ను నియమించిన కేఏ పాల్.. రేవంత్ స‌ర్కార్‌పై విమర్శలు

Praja Shanti Party

Updated On : March 25, 2024 / 2:49 PM IST

KA Paul : తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవలే మా పార్టీలో చేరిన సినీనటుడు, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని, అంతేకాక.. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా బాబూ మోహన్ ను నియమిస్తున్నట్లు కేఏ పాల్ చెప్పారు. తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంకు లేదన్నారు. ఓట్లులేని పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో కొందరు బాడాబాబులు డబ్బు ఇచ్చారంటూ పాల్ విమర్శించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. నాగర్ కర్నూల్ లో ప్రవీణ్ కుమార్ ఓటు బ్యాంకు లేదు. కేసీఆర్ నా జోలికి రాలేదు.. అందుకే హాస్పిటల్ లో చేరితే ప్రార్థన చేశానని పాల్ చెప్పారు. నా దగ్గర రెండు బటన్స్ ఉన్నాయి. ఈడీ, ఐటీలతో దాడులు చేయించ గలను. ఆపగలనంటూ పాల్ అన్నారు.

Also Read : హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్.. బీఆర్ఎస్ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే..

రేవంత్ సర్కార్ పై విమర్శలు..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నలుగురు ఏక్ నాథ్ షిండేలు సిద్ధంగా ఉన్నారు. అందులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మరో ఇద్దరు పేర్లుకూడా నాకు తెలుసు. వారి పేర్లు బయటకు చెప్పను. ఎందుకంటే వాళ్లు నాకు దగ్గరి మిత్రులు అని పాల్ అన్నారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో జనానికి మంచినీళ్లు ఇవ్వలేక పోయారు. కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. రేవంత్ సర్కార్ అప్పుల ఊబిలోలో కూరుకుపోయింది.. మిగిలిన హామీలు ఎలా నెరవేర్చుతారని కేఏ పాల్ ప్రశ్నించారు. నా సమ్మిట్ హైదరాబాద్ లో పెట్టొద్దని రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు చెప్పారు. కేఏ పాల్ సమ్మిట్ కు పర్మిషన్ ఇస్తే ఇబ్బందులు పడతావని రేవంత్ ను హెచ్చరించారని పాల్ అన్నారు.

Also Read : Powers Of Enforcement Directorate : ఈడీ ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చా? అధికారాలు ఏంటి?

చంద్రబాబుపై విమర్శలు..
గతంలో హైదరాబాద్ కు కంపెనీలు తెచ్చింది నేనే. అది చంద్రబాబు నాయుడుకుకూడా తెలుసు. అప్పుల ఊబిలో కూరుకపోయిన తెలంగాణను అభివృద్ధి చేయాలంటే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఏపీని సర్వనాశనం చేశాడు. అక్కడ మా పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయండి.. గెలిపించండి.. ఏపీని పైకి తెస్తాను. అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలంటే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల విజయంతోనే సాధ్యమవుతుందని పాల్ అన్నారు.

బాబూ మోహన్ మాట్లాడుతూ..
ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా తనను నియమించినందుకు కేఏ పాల్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని సినీనటుడు, మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ అన్నారు. నామీద కేఏ పాల్ పెట్టిన బాధ్యతను విస్మరించనని చెప్పారు. గతంలో బీజేపీకోసం పనిచేశానని, ముంబై వెళ్లి కూడా ప్రచారం చేశానని అన్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటానని, అంతేకాక, ప్రజాశాంతి పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల గెలుపుకోసం పనిచేస్తానని బాబూమోహన్ చెప్పారు.