KA Paul: ఈ నియోజక వర్గం నుంచి నేను పోటీ చేస్తా: కేఏ పాల్

ప్రతి జిల్లాకు ఒక్కో కంపెనీ చొప్పున నెలకొల్పి 33 జిల్లాలకు కలిపి 33 లక్షల ఉద్యోగాలు ఇస్తానని కేఏ పాల్ చెప్పారు.

KA Paul: ఈ నియోజక వర్గం నుంచి నేను పోటీ చేస్తా: కేఏ పాల్

KA Paul

Updated On : August 13, 2023 / 7:15 PM IST

KA Paul – Telangana: తెలంగాణలోని చాలా మంది యువత జనగామ(Jangaon), కొత్తగూడెం (Kothagudem) లేదా ఖమ్మం(Khammam) నుంచి తాను పోటీ చేయాలని కోరుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. జనగామ నుంచి పోటీచేయాలని తాను అనుకుంటున్నానని చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు.

అక్కడితో ఆగనని, ప్రతి జిల్లాకు ఒక్కో కంపెనీ చొప్పున నెలకొల్పి 33 జిల్లాలకు కలిపి 33 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఇవాళ ఆయన జనాగాంలో మీడియాతో మాట్లాడారు. కుటుంబ పాలన కావాలంటే కేసీఆర్ ను మళ్లీ ఎన్నుకోవాలని అన్నారు. ఒక్క కుటుంబం కోసం కోట్లాది రూపాయల అప్పులు చేశారని ఆరోపించారు.

అప్పుల తెలంగాణ నుంచి విముక్తి కావాలని కేఏ పాల్ అన్నారు. అది జరగాలంటే తన ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోవాలని కోరారు. రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి ఎందుకు ఉండకూడదని నిలదీశారు. జనగామతో పాటు వరంగల్లో తమ పార్టీ బలాన్ని పెంచుకున్నామని చెప్పారు. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలంగాణా ద్రోహి అని అన్నారు.

తాను, కేసీఆర్ ఆంధ్ర నుంచి వచ్చామని కేఏ పాల్ చెప్పారు. షర్మిల ఇప్పుడు జీరో అవ్వడానికి కారణం రేవంత్ రెడ్డేనని అన్నారు. షర్మిల వచ్చి తన పార్టీలో చేరాలని ఆహ్వానించారు. పాలేరు నుంచి తాను టికెట్ ఇస్తానని అన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రజా శాంతి పార్టీలోకి రావాలని ఆయన ఆహ్వానించారు.

YS Sharmila: ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసిన తర్వాత.. షర్మిల చేసిన రెండో ట్వీట్ ఇది..