KA Paul: కేసీఆర్ మరోసారి సీఎం అవరు: విజయవాడలో కేఏ పాల్

KA Paul: విజయవాడలో కేఏ పాల్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

KA Paul: కేసీఆర్ మరోసారి సీఎం అవరు: విజయవాడలో కేఏ పాల్

KA Paul

Updated On : April 27, 2023 / 5:38 PM IST

KA Paul: కేసీఆర్ మరోసారి సీఎం అవరని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విజయవాడలో ఆయన ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. “కేసీఆర్ నన్ను అరెస్టు చేయాలని పోలీసులను వాడుకున్నారు. కేసీఆర్ ను తిట్టానని ఒక ఎస్సీతో కంప్లైంట్ పెట్టించారు. కేసీఆర్ మరోసారి సీఎం అవరు. సీఎంలు, మంత్రులు టెర్రరిస్టుల్లా పనిచేస్తున్నారు” అని అన్నారు.

“ఏపీలో టీడీపీ, వైసీపీ నేతలు రాత్రి సమయంలో వచ్చి నన్ను కలుస్తున్నారు. అన్ని పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ను వ్యతిరేకిస్తున్నాయి. 44 వేల కుటుంబాలు స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సీఆర్ఏలు ఉండాలని డైరెక్షన్ ఇవ్వాలని కోరాం.

వేసవి సెలవుల తరువాత వాదనలు వింటామని ఛీఫ్ జస్టిస్ అన్నారు. విశాఖలో పుట్టాను.. నేనే ఎంపీ అయి ఉంటే పార్లమెంట్ ముందు ఆమరణ నిరాహారదీక్ష చేసే వాడిని. నా వినతిని ఛీఫ్ జస్టిస్ విన్నారు. తెలుగు వాళ్లందరం కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలి” అని కేఏ పాల్ అన్నారు.

మరణించడానికి ముందే నాకు చెప్పారు..
వైఎస్ వివేకానంద రెడ్డి కేసు గురించి కేఏ పాల్ స్పందించారు. “వివేకానంద రెడ్డి మరణించి చాలా కాలం అయింది. వివేకానంద రెడ్డిని దారుణంగా చంపేశారు. వివేకా కేసులో న్యాయం జరగాలి. రాజకీయ హత్యా? కుటుంబ హత్యా? ఎవరు చంపారో సీబీఐ తేల్చగలదు. వివేకా శత్రువులు ఎవరు అని ఆయన మరణించడానికి ముందే నాకు చెప్పారు. తనకు ప్రాణహాని ఉంది అని వివేకా నాతో చెప్పారు” అని అన్నారు.

Kethireddy Venkataramireddy : పక్కా ప్లాన్ తో సీఎం జగన్ కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం : ఎమ్మెల్యే కేతిరెడ్డి