Kadiyam Srihari: మేము ఆ ఓటమిని ఊహించలేదు: కడియం శ్రీహరి

అందుకే ఎర్రబెల్లి ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని కడియం శ్రీహరి చెప్పారు.

Kadiyam Srihari: మేము ఆ ఓటమిని ఊహించలేదు: కడియం శ్రీహరి

Kadiyam Srihari

Updated On : April 15, 2024 / 4:41 PM IST

తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. జనగామ జిల్లాలో నిర్వహించిన పాలకుర్తి కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పాలకుర్తి ఓటర్ల దెబ్బకు ఎర్రబెల్లి మైండ్ బ్లాంక్ అయిందని అన్నారు. కాంగ్రెస్ నాయకురాలు యశస్విని రెడ్డి దెబ్బకు ఎర్రబెల్లి షాక్ అయ్యారని అన్నారు.

అందుకే ఎర్రబెల్లి ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని కడియం శ్రీహరి చెప్పారు. ఎర్రబెల్లికి ముందునుంచే సరిగ్గా మాట్లాడటం రాదని, ఇప్పుడు యశస్విని రెడ్డి దెబ్బకు మరింత బిత్తిరి అయ్యారని కడియం శ్రీహరి అన్నారు. తాము ఆ ఓటమిని ఊహించలేదని తెలిపారు.

కాగా, తెలంగాణ ఎన్నికల్లో యశస్విని చేతిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఓడిపోయిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో కడియం శ్రీహరి కూతురు కావ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కినప్పటికీ కావ్య ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నాయి.

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వరుస షాక్‌లు