Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వరుస షాక్‌లు

ఇప్పటికే 14 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్నారు కేజ్రీవాల్. మార్చి 21న ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వరుస షాక్‌లు

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. కస్టడీ పొడిగించాలని కోర్టును ఈడీ కోరడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

కేజ్రీవాల్ ఒకవేళ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, ఆధారాలను తారుమారు చేస్తారని ఈడీ తెలిపింది. కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని చెప్పింది. ఈ కేసులో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని తెలిపింది. రూ.100 కోట్ల ముడుపులు తీసుకుని, వ్యాపారులకు అనుకూలంగా లిక్కర్ పాలసీలో మార్పులు చేసారని ఈడీ పేర్కొంది.

ఇప్పటికే 14 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్నారు కేజ్రీవాల్. మార్చి 21న ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. లిక్కర్ పాలసీ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ కొనసాగింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నేతలు అరెస్టయ్యారు. కేజ్రీవాల్ అరెస్టుతో ఇకపై అరెస్టులు జరగబోవని అందరూ భావించారు. అయితే, మరిన్ని అరెస్టులూ ఉండొచ్చని తెలుస్తోంది.

సుప్రీంకోర్టులోనూ..

సుప్రీంకోర్టులోనూ కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు.

Also Read: నేను, నా భార్య మాట్లాడుకున్న ప్రైవేట్ సంభాషణలు విన్నారు: షబ్బీర్ అలీ