Kaleswaram : భారీ వరదలకు నీట మునిగిన కాళేశ్వరం పంప్ హౌజ్‌లు

గతంలో ఎన్నడూ ఇలాంటి వరదలు రాలేదని పెంటారెడ్డి తెలిపారు. కాళేశ్వరం దగ్గర వరద ఉధృతి ఎక్కువగా ఉందన్నారు. వరదల్లో పంప్‌హౌస్‌లు మునగడం సాధారణమన్నారు. పంప్‌హౌస్‌లకు ఎలాంటి ఇబ్బంది ఉండవని స్పష్టం చేశారు. వరద తగ్గగానే పంప్‌హౌస్‌లను పునరుద్ధరిస్తామని పెంటారెడ్డి తెలిపారు.

Kaleswaram :  భారీ వరదలకు నీట మునిగిన కాళేశ్వరం పంప్ హౌజ్‌లు

Kaleshwaaram

Updated On : July 15, 2022 / 5:04 PM IST

Kaleswaram : పెద్దపల్లి జిల్లాలో భారీ వరదలకు కాళేశ్వరం పంప్ హౌజ్ లు నీట మునిగాయి. లక్ష్మీ పంప్ హౌజ్‌లో 17, సరస్వతి పంప్ హౌజుల్లో 12 మోటార్లు పూర్తిగా నీటి మునిగాయి. స్కాడా వ్యవస్థ, కంట్రోల్ ప్యానెళ్లు, స్టార్టర్లు, ఎలక్ట్రికల్ పరికరాలు కూడా పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. కోట్లల్లో నష్టం జరిగిందని భావిస్తున్న అధికారులు…నీరు తగ్గితే నష్టాన్ని అంచనా వేయవచ్చంటున్నారు. వరదలతో.. కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్‌లకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని నీటిపారుదల శాఖ సలహాదారులు పెంటారెడ్డి అన్నారు. కాళేశ్వరం దగ్గర వరద ఉధృతి ఎక్కువగా ఉందని.. వరదల్లో పంప్‌హౌస్‌లు మునగడం సాధారణమని అన్నారు.

గతంలో ఎన్నడూ ఇలాంటి వరదలు రాలేదని పెంటారెడ్డి తెలిపారు. కాళేశ్వరం దగ్గర వరద ఉధృతి ఎక్కువగా ఉందన్నారు. వరదల్లో పంప్‌హౌస్‌లు మునగడం సాధారణమన్నారు. పంప్‌హౌస్‌లకు ఎలాంటి ఇబ్బంది ఉండవని స్పష్టం చేశారు. వరద తగ్గగానే పంప్‌హౌస్‌లను పునరుద్ధరిస్తామని పెంటారెడ్డి తెలిపారు. నీళ్లు తగ్గాక బాగు చేసి యధావిధిగా పంపింగ్ చేస్తామని చెప్పారు. అందరూ అన్నట్టు పెద్దగా నష్టం జరగలేదని పెంటారెడ్డి అన్నారు.

Godavari Flood Water : జలదిగ్బంధంలో భద్రాచలం..రామయ్య ఆలయాన్ని చుట్టుముట్టిన ఉగ్ర గోదావరి

‘ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది అని ఎవరు ఉహించరు. పంప్ హౌస్ నిర్మాణం చేపట్టేటప్పుడు గడిచిన 30 సంవత్సరాల కాలం రికార్డు లు పరిశీలిస్తాం కానీ గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ ఇంత పెద్ద వరదలు రాలేదు. కాళేశ్వరం దగ్గర వరద ఉధృతి ఎక్కువగా ఉంది ఇప్పుడే ఎలాంటి అంచనా వేయలేము. ఇంత పెద్ద వరదలు వచ్చినప్పుడు పంప్ హౌస్ లు మునగడం సర్వసాధారణం పంప్ హౌస్ లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

వరద తగ్గగానే పంప్ హౌస్ లను పరిశీలించి పునరుద్ధరణ పనులు ప్రారంభం చేస్తామని చెప్పారు. బాహుబలి పంప్ హౌస్ మునిగింది అని ప్రచారం చేస్తున్నారు ఇది పూర్తి అవాస్తవం అన్నారు. అనుకోకుండా గ్రౌండ్ వాటర్ పెరిగితే బావి లో మోటర్లు మునిగిపోయాయి ఇవి కూడా అంతే…నీళ్లు తగ్గాక వాటిని బాగు చేసి యధావిధిగా పంపింగ్ చేస్తామని చెప్పారు.

అందరూ అన్నట్టు పెద్దగా నష్టం జరుగలేదు. రెండు, మూడు నెలలో పంప్ హౌస్ పునరుద్ధరణ చేసి రైతాంగం కు సాగు నీరు అందిస్తామని పేర్కొన్నారు. రైతన్నలు ఎవరు ఆందోళన చెదవద్దు…యాసంగి పంటకు యధావిధిగా సాగునీరు అందుతుంది. గతంలో శ్రీశైలం పంప్ హౌస్, పాలమూరు రంగారెడ్డి పంప్ హౌస్ లు మునిగాయి వాటిని పునరుద్ధరణ చేసి యధావిధి స్థితికి తెచ్చమని గుర్తు చేశారు.