MLC Kavitha Arrest : నా అరెస్టు చట్టవిరుద్ధం.. న్యాయ పోరాటం చేస్తానన్న కవిత

కవిత మాట్లాడుతూ.. ఈడీ తనను చట్టవిరుద్దంగా అరెస్టు చేసిందని, అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

MLC Kavitha Arrest : నా అరెస్టు చట్టవిరుద్ధం.. న్యాయ పోరాటం చేస్తానన్న కవిత

Kavitha

Delhi Excise Policy Case :  సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాత్రి 8.45 గంటలకు ఆమెను విమానంలో ఢిల్లీకి ఈడీ అధికారులు తరలించారు. రాత్రి 11.30 గంటలకు కవిత ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి అర్థరాత్రి సమయంలో ఈడీ ప్రధాన కార్యాలయంకు ఆమెను తరలించారు. శనివారం ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కవితను ఢిల్లీలోని అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Also Read : MLC Kavitha Arrest : రాత్రంతా ఈడీ ప్రధాన కార్యాలయంలోనే ఎమ్మెల్సీ కవిత.. ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్న ఈడీ

ఈ సమయంలో కవిత మాట్లాడుతూ.. ఈడీ తనను చట్టవిరుద్దంగా అరెస్టు చేసిందని, అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. కోర్టులో జస్టిస్ కేఎం నాగపాల్ ముందు కవితను హాజరుపర్చారు. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి, మోహిత్ రావులు వాదనలు వినిపిస్తుండగా.. ఈడీ తరపున ఎస్వీ రాజు, ఎన్కె మట్టా, జె. హుస్సేన్ లు వాదులు వినిపిస్తున్నారు. అయితే, ఈడీ తరపున న్యాయవాదులు కవితను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు.