అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్

  • Published By: venkaiahnaidu ,Published On : January 17, 2019 / 05:43 AM IST
అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్

Updated On : January 17, 2019 / 5:43 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ గన్ పార్కులో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా అమరవీరులకు నివాళుర్పించిన అనంతరం కేసీఆర్ అసెంబ్లీకి బయలు దేరారు. హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరవీరులకు నివాళులర్పించారు. ఉ. 11.30 నిమిషాలకు శాసనసభ ప్రారంభం అవుతుంది. సీఎంతో పాటు సభ్యులందరూ ప్రమాణస్వీకారం చేయనున్నారు.  ప్రొటెం స్పీకర్ గా ఎన్నికైన ముంతాజ్ అహ్మద్   ఖాన్ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు.