ఇప్పుడు నీటి ట్యాంకర్ల వ్యాపారం నడుస్తోంది: సూర్యాపేటలో కేసీఆర్ ఫైర్

తాను బాధతో మాట్లాడుతున్నానని చెప్పారు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని అన్నారు. సీఎంకు ఢిల్లీ యాత్రలే..

ఇప్పుడు నీటి ట్యాంకర్ల వ్యాపారం నడుస్తోంది: సూర్యాపేటలో కేసీఆర్ ఫైర్

KCR

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటలో ఎండిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు తీరుపై మండిపడ్డారు.

వంద రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ అన్నారు. కరెంటు పదే పదే పోతోందని చెప్పారు. హైదరాబాద్‌ సిటీలో వాటర్‌ ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు అక్కడ నీటి ట్యాంకర్ల వ్యాపారం నడుస్తోందని విమర్శించారు. ప్రస్తుతం కరెంట్‌ ఉంటే అదే వార్త అవుతుందని ఎద్దేవా చేశారు.

నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశామని రైతులు చెప్పారని కేసీఆర్ అన్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోయాయని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానానికి ఎదిగిన తెలంగాణ రాష్ట్రంలో ఈ దుస్థితి ఎందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలను తీర్చిదిద్దామని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఈ దరిద్రమెందుకని అన్నారు.

ఇప్పుడు పంటలు ఎండని జిల్లానే లేదని కేసీఆర్ అన్నారు. తాను బాధతో మాట్లాడుతున్నానని చెప్పారు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని అన్నారు. సీఎంకు ఢిల్లీ యాత్రలే సరిపోతాయని చెప్పారు. ఈ ప్రభుత్వ మెడలు వంచుతామని అన్నారు.

Vykuntam Prabhakar Chowdary : అనంతపురంలో టీడీపీకి షాక్? మాజీ ఎమ్మెల్యే కీలక నిర్ణయం?