KCR : ఎమ్మెల్యేగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.40 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తారు.

KCR : ఎమ్మెల్యేగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

KCR

Updated On : January 31, 2024 / 4:45 PM IST

BRS Chief KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.40 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. 12గంటలకు అసెంబ్లీకి చేరుకోనున్న కేసీఆర్.. నేరుగా అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయంకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత స్పీకర్ చాంబర్ కు కేసీఆర్ వెళ్తారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి తరలిరానున్న నేపథ్యంలో అసెంబ్లీ వర్గాలు భద్రతా ఏర్పాట్లపై దృష్టిపెట్టాయి.

Also Read : కొలిక్కి వచ్చిన ఒంగోలు పంచాయితీ.. అధిష్టానం నిర్ణయమే ఫైనల్.. ఎంపీ అభ్యర్థిగా ఎవరొచ్చినా ఒకేనన్న బాలినేని

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, ఎన్నికల తరువాత కేసీఆర్ బాత్రూంలో జారిపడటంతో ఆయన తుంటి విరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు కేసీఆర్ కు శస్త్ర చికిత్స నిర్వహించారు. వైద్యుల సూచన మేరకు కేసీఆర్  విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగిలిగారు. తాజాగా కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడటంతో రేపు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అసెంబ్లీకి రానున్నారు.