RRR : రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణంలో కీలక ముందడుగు..
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం రోడ్డు మొత్తం 5 భాగాలుగా విభిజించగా, 7వేల 104 కోట్లతో రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచింది కేంద్రం.

RRR : తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం రోడ్డు నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం టెంటర్లు ఆహ్వానించింది. గిమ్మాపూర్ నుంచి యాదాద్రి వరకు నాలుగు లేన్ల ఎక్స్ ప్రెస్ వే కోసం టెండర్లు పిలించింది. సంగారెడ్డిలోని గిమ్మాపూర్ నుంచి యాదాద్రి వరక పనులు జరగనున్నాయి.
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం రోడ్డు మొత్తం 5 భాగాలుగా విభిజించగా, 7వేల 104 కోట్లతో రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచింది కేంద్రం. రెండేళ్లలో ఆర్ఆర్ఆర్ నిర్మాణం పూర్తి చేయాలని టెండర్ నిబంధనల్లో పేర్కొన్నారు. ఉత్తర భాగం పనులను 5 ప్యాకేలీలుగా విభజించి స్టేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లను ఆహ్వానించింది.
నాలుగు లేన్ల యాక్సిస్ గ్రీన్ ఫీల్డ్ రిజినల్ ఎక్స్ ప్రెస్ వే అభివృద్ధికి టెండర్లు పిలుస్తున్నట్లు పేర్కొంది. మొత్తం 5 ప్యాకేజీలకు విభజంచి టెండర్లు పిలవగా.. అంచనా వేయం 7,104 కోట్లగా పేర్కొంది. రెండేళ్లలో ట్రిపుల్ ఆర్ పనులు పూర్తి కావాలని, మెయింటెన్స్ వ్యవధి 5 ఏళ్లుగా నిబంధనల్లో పేర్కొంది.
పూర్తి వివరాలు..
Also Read : సంక్రాంతి నుంచి రైతుభరోసా..! వారు మాత్రమే అర్హులు..!