Puvvada Ajay Kumar: కాంగ్రెస్ నాయకులు ఎంతమంది గోడలు కూల్చి కబ్జాలు చేశారో మా దగ్గర ఆధారాలున్నాయి

నా ప్రత్యర్థి పెద్దాయన విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఖమ్మంలో ఇసుక మాఫియా అంటున్నాడు. ఖమ్మంలో ఇసుక ఎక్కడుందో ఆయనే చెప్పాలి అంటూ తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశిస్తూ పువ్వాడ విమర్శలు చేశారు.

Puvvada Ajay Kumar: కాంగ్రెస్ నాయకులు ఎంతమంది గోడలు కూల్చి కబ్జాలు చేశారో మా దగ్గర ఆధారాలున్నాయి

Thummala Nageswara Rao

Updated On : November 4, 2023 / 1:54 PM IST

Khammam BRS MLA Ajay Kumar: ఖమ్మం జిల్లా కేంద్రంలో రేపు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి, ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్ధి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో వింత పోకడలను చూస్తున్నాం. ఎస్ఆర్అండ్ బిజీయన్ఆర్ గ్రౌండ్స్ లో ఒక వేదిక ఉండేది. దాన్ని ముఖ్యమంత్రి భద్రత దృష్ట్యా తొలగించాం. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో కొందరు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. సభ తరువాత మళ్లీ దానిని కట్టిస్తామని ప్రిన్సిపాల్ తో చెప్పాం.. లక్ష రూపాయలుకూడా డిపాజిట్ చేశామని అని పువ్వాడ తెలిపారు.

Also Read : Mark Zuckerberg : హాస్పిటల్ బెడ్​పై మార్క్ జుకర్‌బర్గ్ .. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు.. ఇన్‌స్టాలో ఆసక్తికర పోస్ట్

కొంతమంది నన్ను సైకో అంటున్నారు.. ఈ సైకోగాళ్లకోసం ఎన్నికల తరువాత ఖమ్మంలో ఓ పిచ్చాసుపత్రి కట్టించాలి అంటూ పువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశమే కుప్పకూలిపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమంది గోడలు కూల్చి కబ్జాలు చేశారో మా దగ్గర ఆధారాలున్నాయి. నా ప్రత్యర్థి పెద్దాయన విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఖమ్మంలో ఇసుక మాఫియా అంటున్నాడు. ఖమ్మంలో ఇసుక ఎక్కడుందో ఆయనే చెప్పాలి అంటూ తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశిస్తూ పువ్వాడ విమర్శలు చేశారు.

Also Read : Congress – CPI Alliance : కొలిక్కివచ్చిన చర్చలు.. కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు ఖరారు

ఖమ్మంలో రేపు జరిగే సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభకు భారీ సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. సభకు సంబంధించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. ఖమ్మం ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. ఈ దఫా ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని పువ్వాడ అజయ్ కుమార్ దీమా వ్యక్తం చేశారు.