Jana Ashirwad Yatra : కిషన్ రెడ్డి భావోద్వేగం, ముగిసిన జన ఆశీర్వాద యాత్ర

మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర హైదరాబాద్‌లో ముగిసింది. అంబర్‌పేటలో పర్యటించిన సందర్భంగా కిషన్‌రెడ్డికి నగర ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు.

Jana Ashirwad Yatra : కిషన్ రెడ్డి భావోద్వేగం, ముగిసిన జన ఆశీర్వాద యాత్ర

Kishan Reddy

Updated On : August 22, 2021 / 7:08 AM IST

Kishan Reddy : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర హైదరాబాద్‌లో ముగిసింది. అంబర్‌పేటలో పర్యటించిన సందర్భంగా కిషన్‌రెడ్డికి నగర ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు. బీజేపీ కార్యాలయం వరకు భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు, కార్యకర్తలతో ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తనను ఆదరించిన అంబర్‌పేట, సికింద్రాబాద్ ప్రజలను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. అంబర్‌పేటకు వస్తే చాలా రోజుల తర్వాత.. బిడ్డ తన తల్లి దగ్గరకు వచ్చినట్లుగా అనిపిస్తోందన్నారాయన.

Read More : Afghanistan : 640 మంది కాదు..823 మంది!

అంబర్‌పేటలో జన ఆశీర్వాద సభలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నానంటే అంబర్‌పేట అసెంబ్లీ, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలే కారణమని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రమంత్రి అయినందుకు తనకు సంతోషం లేదని.. దానికన్నా అంబర్‌పేటకు దూరమయ్యానన్న బాధే ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంబర్‌పేటలో గల్లీ గల్లీ తిరిగినట్లు కిషన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తన బాధ్యతలు పెరిగాయని.. ఢిల్లీలోనే ఉంటూ, అందరినీ కలుస్తూ… అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించాలని కిషన్ రెడ్డి చెప్పారు.

Read More : Sirisilla : ప్రభుత్వాస్పత్రిలో బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసిన మహిళా సిబ్బంది

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర చివరి రోజు భాగ్యనగరంలో జరిగింది. ఉదయం యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకున్న తర్వాత.. మూడో రోజు యాత్రను ప్రారంభించారు కిషన్‌రెడ్డి. ఘట్‌కేసర్ మీదుగా ఉప్పల్‌ చేరుకుని… అక్కడి నుంచి.. రామంతపూర్, గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన అంబర్‌పేటలో పర్యటించారు. అడుగడుగునా కిషన్‌రెడ్డికి భాగ్యనగర ప్రజలు సాదర స్వాగతం పలికారు.

Read More : Taliban Posts: సోషల్ మీడియాలో తాలిబాన్ల పోస్టులు చేసిన 14మంది అరెస్ట్