Taliban Posts: సోషల్ మీడియాలో తాలిబాన్ల పోస్టులు చేసిన 14మంది అరెస్ట్

సోషల్ మీడియా సైట్లలో తాలిబాన్ యాక్టివిటీలను పోస్టు చేస్తున్న 14మందిని అరెస్టు చేసింది అస్సాం పోలీస్ డిపార్ట్‌మెంట్.

Taliban Posts: సోషల్ మీడియాలో తాలిబాన్ల పోస్టులు చేసిన 14మంది అరెస్ట్

Taliban Post

Updated On : August 21, 2021 / 4:04 PM IST

Taliban Posts: సోషల్ మీడియా సైట్లలో తాలిబాన్ యాక్టివిటీలను పోస్టు చేస్తున్న 14మందిని అరెస్టు చేసింది అస్సాం పోలీస్ డిపార్ట్‌మెంట్. ఈ మేరకు అస్సాం స్పెషల్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీపీ సింగ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ప్లాట్ ఫాంల మీద ఏదైనా పోస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి.

తాలిబాన్ యాక్టివిటీల గురించి చేసిన పోస్టులకు గానూ 14మందిని అరెస్టు చేశారు అస్సాం పోలీసులు. సోషల్ మీడియాలో చేసే పోస్టుల విషయంలో అప్రమత్తంగా ఉంటే చట్టపరంగా విధించే శిక్షల నుంచి తప్పించుకోవచ్చని సింగ్ ట్వీట్ ద్వారా వెల్లడించారు.

ఆగష్టు 15న అఫ్ఘానిస్తాన్ ను తాలిబాన్లు స్వాధీనం పరచుకుని.. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ను సీజ్ చేశారు. అష్రఫ్ ఘనీ పారిపోయిన తర్వాత దేశం మొత్తాన్ని పూర్తి కంట్రోల్ లోకి తెచ్చేసుకున్నారు. దేశం నుంచి పలువురు పౌరులు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా వారిని కూడా బెదిరించి ఆపే ప్రయత్నం చేస్తున్నారు.