Afghanistan : 640 మంది కాదు..823 మంది!

సీ -17 వాయుసేన విమానంలో జనం కిక్కిరిసి కూర్చున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి..ఆ విమానంలో 640 మంది ఉన్నారని మొదట తెలిపారు.

Afghanistan : 640 మంది కాదు..823 మంది!

Afghanistan (3)

Updated On : August 22, 2021 / 6:58 AM IST

Afghanistan : ఆఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌ నుంచి గత ఆగస్టు 15న బయలుదేరిన విమానంలో అంచనా వేసిన దాని కంటే చాలా ఎక్కువ మందే ప్రయాణించినట్లు అమెరికా ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు తెలిపారు. సీ-17 వాయుసేన విమానంలో జనం కిక్కిరిసి కూర్చున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ విమానంలో 640 మంది ప్రయాణికులున్నట్లు అప్పట్లో అంచనా వేశారు. కానీ ఆ విమానంలో మొత్తం 823 మంది ప్రయాణించినట్లు ఎయిర్ మొబిలిటీ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది.

చిన్నారులంతా పెద్ద వారి భుజాలపైన, వీపుమీద కూర్చుని ఉన్నారని, వారిని ఇప్పటి దాకా లెక్కలోకి తీసుకోలేదని పేర్కొంది. సీ-17లో ఇంతమంది జనం ప్రయాణించడం కొత్త రికార్డని తెలిపింది. ఇదిలా ఉంటే కాబుల్ లో తాలిబన్ అరాచకాలు కొనసాగుతూనే అయ్యి. దేశం విడిచి పారిపోయేవారు సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దేశ సరిహద్దులు వెంట ప్రజలు బారులు తీరారు.

ఇక శనివారం 150 మంది భారతీయులను కిడ్నాప్ చేశారంటూ వచ్చిన వార్తలపై తాలిబన్లు స్పందించారు. తాము కిడ్నాప్ చేయలేదని సురక్షితంగా కాబుల్ విమానాశ్రయానికి చేర్చమని తెలిపారు. తమను చూసి భారతీయులు భయపడ్డారని.. ఎమర్జెన్సీ మార్గం గుండా బయటకు పోతున్న వారిని అడ్డుకున్నామని తెలిపారు. ఇక అంతకు ముందు 87 మందిని భారత్ కు తరలించారు అధికారులు. అది అఫ్ఘానిస్తాన్ నుంచి తజకిస్థాన్ మీదుగా భారత్ కు చేరినట్లు తెలిపారు.