Kishan Reddy With Corporators : జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు కేంద్రమంత్రి క్లాస్

కొంతమంది కార్పొరేటర్లపై వచ్చిన ఫిర్యాదులపై ఫైర్ అయ్యారు. అవినీతికి పాల్పడొద్దని హితవు పలికారు. వారిని వేధించవద్దని సూచించారు.

Kishan Reddy With Corporators : జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు కేంద్రమంత్రి క్లాస్

Kishan Reddy With Corporators

Updated On : April 23, 2022 / 4:46 PM IST

Kishan Reddy With Corporators : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీజేపీ కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ హాట్ హాట్ గా సాగింది. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లాస్ పీకారు. కొంతమంది కార్పొరేటర్లపై వచ్చిన ఫిర్యాదులపై ఆయన ఫైర్ అయ్యారు. అవినీతికి పాల్పడొద్దని హితవు పలికారు. నూతన భవన నిర్మాణాలు చేస్తున్న వారిని వేధించవద్దని సూచించారు.

GVL Narasimha Rao : కేంద్ర పథకాలకు మీ స్టిక్కర్ వేసుకుంటే ఊరుకునేది లేదు-జీవీఎల్ నరసింహారావు

కొంతమంది కార్పొరేటర్లు యాక్టివ్ గా ఉండటం లేదని కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని సూచించారు. మంచిగా పని చేస్తే ప్రధాని నరేంద్ర మోదీతో కల్పిస్తానని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ కు కేంద్రం ఏం చేసిందో ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.

Minister gangula: తెలంగాణపై కిషన్ రెడ్డి విషం చిమ్ముతుండు.. ఒక్క గింజకూడా పక్కదారి పట్టదు..

ఈ నెల 30న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్ కు రానున్నారు. రూ.20 వేల కోట్ల జాతీయ రహదారుల నిర్మాణంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. శంషాబాద్ లో సభ ఏర్పాటుకు సన్నాహకంగా కార్పొరేట్లతో కిషన్ రెడ్డి ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు.