GVL Narasimha Rao : కేంద్ర పథకాలకు మీ స్టిక్కర్ వేసుకుంటే ఊరుకునేది లేదు-జీవీఎల్ నరసింహారావు

Gvl Narasimha Rao
GVL Narasimha Rao : రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలకు బీజేపీ అంటే భయం పట్టుకుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రాలకు విస్తృతంగా సహాయం చేస్తున్నా తెలుగు రాష్ట్రాలు రెండు కేంద్రాన్ని విమర్శిస్తున్నాయని అన్నారు.
తెలంగాణలో బీజేపీ అంటే భయంతోనే కేటీఆర్ హద్దులు మీరి కేంద్రాన్ని విమర్శిస్తున్నారని జీవిఎల్ చెప్పారు. పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాద తీర్మానంపై మోడీ ప్రసంగాన్ని తప్పుగా ప్రచారం చేస్తూ విమర్శలు చేశారని ఆయన అన్నారు. బీజేపీపై తప్పుడు విమర్శలు చేస్తే చట్టబద్దంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలకు ఇచ్చిన నోటీసులకు ఎడిటర్లు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని జీవీఎల్ చెప్పారు. కేంద్ర పథకాలకు తమ స్టిక్కర్లు వేసుకుని రాష్ట్రాలు ప్రచారం చేసుకుంటున్నాయని…. ఇకనుంచి కేంద్ర పథకాలకు తమ స్టిక్కర్లు వేసుకుంటే ఊరుకునేది లేదని ఆయన చెప్పారు.
ఏపీ ప్రభుత్వం ఎంతమందికి సబ్సిడీ బియ్యం ఇచ్చిందో వివరంగా చెప్పాలని ఆయన కోరారు. కోవిడ్ సమయంలో కేంద్రం ఇచ్చిన ఉచిత బియ్యానికి రాష్ట్రాలు స్టిక్కర్లు వేసుకున్నాయని జీవీఎల్ ఆరోపించారు. కేంద్ర మంత్రులు రాష్ట్రాల్లో పర్యటించి రాష్ట్ర వైఫల్యాలను ఎండగతారని ఆయన తెలిపారు.
Also Read : Hyderabad : గర్భిణి మృతి-వైద్యుల నిర్లక్ష్యం అని ఆరోపణలు
ఏపీ సమస్యలను నేనే రాజ్యసభలో ప్రస్తావిస్తానని…..ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి రాష్ట్ర ప్రాజెక్టులకు ఇచ్చే నిధులు దారి మళ్ళకుండా దీర్ఘకాల ప్రయోజనాలు చేకూర్చే అంశాలకే నిధులు ఇవ్వాలని కోరతానని జీవీఎల్ చెప్పారు.