Hyderabad : గర్భిణి మృతి-వైద్యుల నిర్లక్ష్యం అని ఆరోపణలు

మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా సాయిబాబా నగర్‌కు చెందిన ఆశీయా బేగం(21)ను గత రాత్రి డెలివరీ కోసం ఆమె కుటుంబ సభ్యులు షాపూర్ నగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు  వచ్చారు.

Hyderabad : గర్భిణి మృతి-వైద్యుల నిర్లక్ష్యం అని ఆరోపణలు

Preganant Died

Hyderabad :  మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా సాయిబాబా నగర్‌కు చెందిన ఆశీయా బేగం(21)ను గత రాత్రి డెలివరీ కోసం ఆమె కుటుంబ సభ్యులు షాపూర్ నగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు  వచ్చారు. ఈ తెల్లవారుజామున ఆస్పత్రి వైద్యురాలు సమక్షంలో ఆపరేషన్ చేయగా ఆశీయా బేగం బిడ్డకు జన్మనిచ్చింది.

కాసేపటికే నర్సు వెళ్లి గర్భిణీకి వైద్యురాలు సూచించిన ఇంజక్షన్ ఇవ్వడంతో ఆమె మృతి  చెందిందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కాన్పు అయిన మహిళ మృతి చెందిన రెండు గంటల తరువాత తమకు తెలిపారని… అప్పటి  వరకు ఆమెను చూడనివ్వలేదని కుటుంబ సభ్యులు అరోపిస్తున్నారు.

పుట్టిన బిడ్డను హుటాహుటిన మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ వెంటిలేటర్ పై ఉంచారు.  24 గంటలు గడిస్తే కానీ బిడ్డ పరిస్ధితి చెప్పలేమని అక్కడి వైద్యులు తెలిపారు.  కాన్పు అయిన మహిళ మృతి చెందిందన్న సమాచారం అందుకున్న బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.
Also Read : Romance On Bike : రెచ్చిపోయిన ప్రేమజంట-నడిరోడ్డుపై రోమాన్స్
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళ మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.