Kishan Reddy : హైదరాబాద్ పేరు మార్చేస్తాం .. అసలు ఎవరీ హైదర్..? ఎవరికి కావాలి హైదర్..? : కిషన్ రెడ్డి
బీజేపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ పేరును బాగ్యనగర్ గా మారుస్తామని అన్నారు. అస్సలు హైదర్ ఎవడు? ఎవరకి కావాలి హైదర్ ? అంటూ ప్రశ్నించారు. రైతు బంధు విడుదల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు.

Kishan Reddy Hyderabad name change
Kishan Reddy Hyderabad name changed : బీజేపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ పేరును బాగ్యనగర్ గా మారుస్తామని అన్నారు. అస్సలు హైదర్ ఎవడు? ఎవరకి కావాలి హైదర్ ? హైదరాబాద్ పేరు ఎందుకు మార్చకూడదు?అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాము అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వచ్చాక రైతుబంధుతో పాటు పాత పధకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
కాగా..అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు బంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది. దీనిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ కావాలనే ఫిర్యాదు చేసి రైతు బంధుని ఆపేలా చేసింది అంటూ విమర్శిస్తున్నారు. కానీ రైతు బంధు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని.. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ప్రభుత్వం రైతుబంధు నిధులు ఎందుకు వేయలేదు?అని ప్రశ్నించారు. దళితబంధుపై కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని..రైతుబంధు, దళితబంధుపై ఫిర్యాదు చేయటం కాంగ్రెస్ కు అలవాటే అంటూ విమర్శించారు. డైరెక్ట్ గా గెలిచే సత్తా లేక.. రైతులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్, కేసీఆర్ లు ఎన్నికల్లో ఓడిపోతున్నారని అన్నారు.
రైతు బంధు సాయాన్ని ఎన్ని రోజులు ఆపుతారు..? : హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
ఏ తప్పు చేయనప్పుడు కాంగ్రెస్ నేత ఐటీ రైడ్స్ అంటే ఎందుకు భయపడ్తున్నారు?అని ప్రశ్నించారు.వివేక్ ఇంట్లో ఐటీ సోదాలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.EBCరిజరేషన్ల ద్వారా పేద ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించామని..కుటుంబ పార్టీలను ఓడించటం ఖాయమన్నారు. ఎన్నికల్లో ఓడిపోయే కాలం వచ్చినా కేసీఆర్ అబద్దాలు చెప్పటం మానలేదని ఎద్దేవా చేశారు.కేసీఆర్ మాటల్లో వాడి వేడి తగ్గిందని తన కుమారుడు కేటీఆర్ ను సీఎం చేయలేకపోతున్నానని నిరాశ కేసీఆర్ లో కనిపిస్తోందని అన్నారు.