Kishan Reddy: సీఎం కేసీఆర్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్‌లో డబ్లూహెచ్ఓ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటుకు స్థలం గుర్తించి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు కిషన్ రెడ్డి.

Minister Kishan Reddy Has Ready To Discuss With The Kcr
Kishan Reddy: హైదరాబాద్‌లో డబ్లూహెచ్ఓ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటుకు స్థలం గుర్తించి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు కిషన్ రెడ్డి. సాంప్రదాయ వైద్యానికి దేశంలోనే గొప్ప చరిత్ర ఉందని, భారతీయ సాంప్రదాయ వైద్యానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చే కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని అందులో వెల్లడించారు.
కారోనా సమయంలో సాంప్రదాయ వైద్యం ఉపయోగాలు మరింత వెలుగులోకి వచ్చాయని, సాంప్రదాయ వైద్యంపై నమ్మకం పెంచేందుకు శాస్త్రీయంగా ఎన్నో పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అవసరమైన రీసెర్చ్ సెంటర్‌లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ పరిశోధనలు సాంప్రదాయ వైద్యాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత ఎత్తుకు తీసుకుని వెళ్తాయని, 2020లో ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా భారతదేశంలో సాంప్రదాయ మెడిసిన్ గ్లోబల్ సెంగర్ ఏర్పాటు చేస్తామని డబ్లుహెచ్ఓ డైరెక్టర్ ప్రకటించారు. కేంద్ర ఆయుష్ మినిస్ట్రీ ట్రెడిషనల్ సైన్టిఫిక్ రీసెర్చ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఇప్పటికే హైదరాబాద్‌లో సీసీఎంబీ, సీఎస్ఐఆర్, డీఆర్డీవో, ఎన్ఐఎన్, ఐఐసీటీ, ఎఫ్డీటీఆర్సీ వంటి సంస్థలు ఏర్పాటు చేసుకున్నామని, హైదరాబాద్‌లో ట్రెడిషనల్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వంతో ఆయుష్ సంస్థ సంప్రదించిందని అన్నారు. వరల్డ్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ హైదరాబాద్‌లో ఏర్పాటుకు సహకరించాలని కోరింది.
ఈ సెంటర్ ఏర్పాటు ఇటు హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రక్రియ ముందుకు సాగేందుకు అవసరమైన పెడింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా గ్లోబల్ ట్రెడిషనల్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు స్థలం గుర్తించాలని కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.