Komatireddy Venkat Reddy: అందుకే హరీశ్ రావు ఇలాంటి కామెంట్లు చేశారు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
సీఎం కావడానికి హరీశ్ రావు ప్లాన్‌లో ఉన్నట్టున్నారని తెలిపారు.

Komatireddy Venkat Reddy
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు మేడిగడ్డ అప్పగిస్తానని దాన్ని బాగుచేసే బాధ్యత తీసుకుంటారా అని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలు విసిరిన విషయం తెలిసిందే. దీంతో నిన్న హరీశ్ రావు స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి దిగిపోతే తాను సీఎం అయి సమస్యలు పరిష్కరిస్తానని హరీశ్ అన్నారు. దీనిపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ హరీశ్ రావుకి చురకలంటించారు.
హరీశ్ రావు వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్‌కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. సీఎం కావడానికి హరీశ్ రావు ప్లాన్‌లో ఉన్నట్టున్నారని తెలిపారు. కేసీఆర్‌ను వ్యతిరేకించి వస్తే అందుకు తాము సపోర్ట్ చేస్తామని చురకలంటించారు.
బీఆర్ఎస్ పార్టీ కవిత, హరీశ్, కేటీఆర్ పేర్ల మీద విడిపోతుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ నాలుగు పార్టీలుగా చీలిపోతుందని అన్నారు. హరీశ్ రావు పార్టీలో ఎల్పీ లీడర్ కూడా కాలేరని, ఆయన 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్‌ను పులి అని అంటున్నారని, ఆయనమో కట్టె పట్టుకొని తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పులి ఎట్లా అవుతారని ప్రశ్నించారు. మరో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని చెప్పారు.
హిందూపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా: పరిపూర్ణానంద స్వామీ