TPCC : అసంతృప్తులను బుజ్జగిస్తున్న హై కమాండ్, ఏఐసీసీలోకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ?
టీపీసీసీ చీఫ్ పదవి వస్తుందని ఆశించిన సీనియర్ నేతలను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ పెద్దలు. రేవంత్ ను మొదటి నుంచి సీనియర్లు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నచ్చచెప్పే పనిలో పడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ మేరకు కోమటిరెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చినట్లు సమాచారం.

Komati Reddy
Komatireddy Venkat Reddy : టీపీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని నియమించింది అధిష్టానం. ఎప్పటి నుంచో సస్పెన్స్ గా కొనసాగుతున్న ఈ ఎంపికకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే..మరో పెద్ద టాస్క్ హై కమాండ్ ఎదుట ఉంది. ఈ పదవి వస్తుందని ఆశించిన సీనియర్ నేతలను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ పెద్దలు. రేవంత్ ను మొదటి నుంచి సీనియర్లు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే..రేవంత్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. దీంతో అసంతృప్తులుగా ఉన్న సీనియర్ నేతలను బుజ్జగించే పనిలో పడింది. వారిని ఎలాగైనా బుజ్జగించాలని భావిస్తోంది. అయితే..టీపీసీసీ చీఫ్ పదవి వస్తుందని ఆశించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నచ్చచెప్పే పనిలో పడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ మేరకు కోమటిరెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చినట్లు సమాచారం.
టీపీసీసీ చీఫ్ పదవిని ఆశించారు వెంకటరెడ్డి. చివరి వరకు పదవి కోసం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి పోటీ పడ్డారు. మిగతా సీనియర్లకు భవిష్యత్‌లో కీలక పోస్టులు వరించే ఛాన్స్ ఉంది. ఎవరూ ఊహించని వ్యక్తులకు పదవులు రావడంపై అసంతృప్తులు పెల్లుబుకుతాయని హైకమాండ్ భావిస్తోంది. అసంతృప్తులు ఎవరూ పార్టీని వీడకుండా..ఉండేందుకు చర్యలు చేపడుతోంది.
– రేవంత్‌రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్న ఏఐసీసీ
– వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్
– వైస్ ప్రెసిడెంట్లుగా చంద్రశేఖర్, దామోదర్‌రెడ్డి, మల్లు రవి, వేంనరేందర్‌రెడ్డి, రమేశ్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్
– క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా మధుయాష్కిగౌడ్
– ఎలక్షన్ కమిటీ చైర్మన్‌గా దామోదరరాజనర్సింహ
– కార్యనిర్వాహక అద్యక్షులు : అజారుద్దిన్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్.
– ఉపాధ్యక్షులు : చంద్రశేఖర్ సంబాని, దామోదర్ రెడ్డి, మల్లు రవి, పోడెం వీరయ్య, సురేశ్ షెట్కార్, వేం నరేందర్ రెడ్డి, రాజేశ్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, జావీద్ అమీర్