KTR-BRS: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోతున్న కేటీఆర్
ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరుకాలేకపోతున్నారు. హైదరాబాద్ లో రెండు ముఖ్యమైన పెట్టుబడి సమావేశాల దృష్ట్యా ఆయన ఇక్కడే ఉంటూ వాటిల్లో పాల్గొనాల్సి ఉంది. జపాన్ కు చెందిన మారుతి సుజుకి సంస్థ ప్రతినిధులతో ఆయన సమావేశం కావాల్సి ఉంది. అలాగే, రాయదుర్గంలోని బోష్ ఆఫీసును ఆయన ప్రారంభిస్తారు. దీంతో ఆయన హైదరాబాద్ లోనే ఉండిపోయారు.

Minister Ktr
KTR-BRS: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరుకాలేకపోతున్నారు. హైదరాబాద్ లో రెండు ముఖ్యమైన పెట్టుబడి సమావేశాల దృష్ట్యా ఆయన ఇక్కడే ఉంటూ వాటిల్లో పాల్గొనాల్సి ఉంది. జపాన్ కు చెందిన మారుతి సుజుకి సంస్థ ప్రతినిధులతో ఆయన సమావేశం కావాల్సి ఉంది. అలాగే, రాయదుర్గంలోని బోష్ ఆఫీసును ఆయన ప్రారంభిస్తారు. దీంతో ఆయన హైదరాబాద్ లోనే ఉండిపోయారు.
కేసీఆర్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నానని, ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోతున్నానని కేటీఆర్ చెప్పారు. ముందే నిర్ణయించిన సమావేశాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో కేటీఆర్ తో పాటు ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొంటారని మొదట ఆ పార్టీ నేతలు తెలిపారు.
కవిత మాత్రమే ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, ఢిల్లీలో సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయం వద్ద నవచండీ యాగం ప్రారంభమైంది. తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు. పలు రాష్ట్రాల నేతలు, రైతు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్